శ్రీముఖి, మ‌హేష్‌ల మ‌ధ్య హాట్ హాట్ డిస్క‌ష‌న్

Sun,October 13, 2019 07:49 AM

బిగ్ బాస్ సీజ‌న్ 3కి మ‌రి కొద్ది రోజుల‌లో ఎండ్ కార్డ్ ప‌డ‌నుంది. ఇప్ప‌టికే త‌మిళంలో బిగ్ బాస్ సీజ‌న్ 3 ముగియ‌గా మలేసియాకు చెందిన యూట్యూబ్ సెన్సేషన్ మరియు సింగర్ మిగన్ రావ్ విజేత‌గా నిలిచారు. మిగన్ రావ్ మరియు శాండీ మాస్టర్ ఫైనల్స్ చేరుకోగా, ఎంతో ఉత్కంఠ న‌డుమ మిగన్ రావ్ విజేతగా నిలిచాడు. దీంతో అతనికి బిగ్ బాస్ ట్రోఫీతో పాటు 50లక్షల రూపాయల నగదు బహుమతి కూడా లభించింది. మ‌రి తెలుగు బిగ్ బాస్‌లో విజేత ఎవ‌రు అనే దానిపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌లు సాగుతున్నాయి.


ఎపిసోడ్ 84లో నాగ్ స్టైలిష్ ఎంట్రీ ఇచ్చారు. అంద‌రికి హాయ్ చెప్పి వెంట‌నే మ‌న టీవీలోకి వెళ్ళారు. శుక్ర‌వారం జ‌రిగిన ఫ‌న్నీ ఇన్సిడెంట్స్ చూపించారు. ఫీల్ ది ఫిజ్ అనే టాస్క్‌లో బాబా భాస్క‌ర్, అలీ, వ‌రుణ్‌లు పాల్గొన‌గా ఎండ్ బ‌జ‌ర్ మోగే స‌రికి ముగ్గురు 12 బాటిల్స్ ఫిజ్ తాగారు. దీంతో గేమ్ టైగా ముగిసింది. మ‌ళ్ళీ స్విమ్మింగ్ పూల్‌లో ఉన్న ఫిజ్ బాటిల్స్ తీసుకొచ్చి తాగాలి అని చెప్ప‌గా, అలీ రెజా ఒక‌టి తాగేసి రెండోది తాగుతున్న స‌మ‌యంలో ఎండ్ బ‌జ‌ర్ మోగించారు బిగ్ బాస్. దీంతో టాస్క్ విజేత‌గా అలీ నిలిచాడు.

అనంత‌రం వితికా, వ‌రుణ్‌ల మ‌ధ్య స్విమ్మింగ్ పూల్‌లో కాసేపు చ‌ర్చ న‌డిచింది. ‘నేను ఈవారం ఎలిమినేట్ అయితే జాగ్రత్త వితికా’ అని వరుణ్ అన‌డంతో వితికా సీరియ‌స్ అయింది. నువ్ వెళ్లినా నేను బాగానే ఉంటా.. నువ్వు ముందు ఇలా అనకు అని వితికా అన‌డంతో ఆమెని కూల్ చేసే ప్ర‌య‌త్నం చేశాడు వ‌రుణ్‌. ఆ త‌ర్వాత నాగార్జున ఇంట్లో ఉన్న 8 మంది స‌భ్యుల‌కి ట్రెజ‌ర్ హంట్ అనే టాస్క్ ఇచ్చారు. ఇంట్లో దాచి ఉన్న 8 వ‌స్తువుల‌ని 8 మంది ప‌ట్టుకోవాల‌ని చెప్పారు. దీంతో అంద‌రు దాగి ఉన్న వ‌స్తువుల‌ని వెతికే ప‌నిలో నిమ‌గ్న‌మయ్యారు. అయితే ఈ టాస్క్‌లో ఏడు వస్తువులను వెతికి పట్టుకున్న ఇంటి సభ్యులు ఒక వస్తువును ఎక్కడ ఉందో కనిపెట్టలేకపోయారు.

ఎనిమిదో వ‌స్తువు ఉన్న ప్లేస్‌ని నాగార్జున చెప్ప‌డంతో బాబా భాస్క‌ర్ వెళ్లి ఆ వ‌స్తువు తీసుకొచ్చారు. త‌ర్వాత దొరికిన ఒక్కో వస్తువుకి ఒక్కో అర్ధం వచ్చేలా బిరుదు ఇచ్చారు నాగార్జున‌. ఇందులో మోస్ట్ డేంజరస్, ఇతరులపై ఆధారపడేవాళ్లు, భజన చేసేవాళ్లు, జోకర్, ఆట ఆడించేది, బలహీనమైనవాళ్లు, సుత్తి వేసేవాళ్లు ఇలా రకరకాల బిరుదులు ఇచ్చారు. వీటిలో ఎవ‌రికి ఏ బిరుదు సూట్ అవుతుందో అది వాళ్ళ‌కి ఇచ్చేయాల‌ని నాగ్ పేర్కొన్నారు. ఈ ప్ర‌క్రియ‌లో ఎక్కువ బిరుదులు వితికా, బాబాలకు రావ‌డం విశేషం

అనంత‌రం బిగ్ బాస్ ఫ్రైజ్ మనీ రూ. 50 లక్షలు వస్తే ఏం చేస్తారు? అని నాగార్జున ఇంటిలో ఉన్న 8 మందిని అడగ్గా.. ఒక్కొక్కరూ ఒక్కో రీజన్ చెప్పారు. అయితే ఈ 50 ల‌క్ష‌ల రూపాయ‌ల ప్రైజ్‌మ‌నీ గెలుచుకునే అర్హ‌త ఎవ‌రికి లేదో చెప్పాల‌ని నాగార్జున ఇంటి స‌భ్యుల‌ని కోర‌గా.. ముందుగా వితికా.. బాబా భాస్క‌ర్ పేరు చెప్పింది. వ‌రుణ్ కూడా ఆయ‌న పేరే చెప్పాడు. రాహుల్.. వరుణ్‌ పేరు చెప్పాడు. అనంతరం మహేష్ విట్టా.. శ్రీముఖి పేరు చెప్పి ఆమె ప్రతిదీ గేమ్‌లాగే ఆడుతుందని ఆమెకు ఈ యాభై లక్షలు తీసుకునే అర్హత లేదన్నాడు. త‌న ప్ర‌వ‌ర్త‌న న‌చ్చ‌ద‌ని పేర్కొన్నాడు.

మ‌హేష్ కామెంట్స్‌పై మండిప‌డ్డ శ్రీముఖి ..అత‌ను ప్ర‌తి విష‌యంలో న‌న్ను టార్గెట్ చేస్తున్నాడు. ప్ర‌తి విష‌యాన్ని త‌న‌కు అనుకూలంగా మార్చుకుంటున్నాడు. ప్ర‌తి స్టోరీని చాలా అందంగా న‌రేట్ చేస్తాడు అని చెప్పుకొచ్చింది. ఇలా ఇద్ద‌రి మ‌ధ్య చాలా డిస్క‌ష‌న్స్ త‌ర్వాత నాగార్జున .. అలీని ఎవ‌రికి 50ల‌క్ష‌లు తీసుకునే అర్హ‌త లేదో చెప్పాల‌ని అని అడ‌గ‌గా, మ‌నీ గురించి కాదు కాని మ‌హేష్ త‌నంత‌ట తానే చాలా సార్లు ఆ అర్హ‌త లేద‌ని చెప్పాడంటూ అలీ వివ‌ర‌ణ ఇచ్చాడు. అనంతరం జ్యోతి సైతం మహేష్ పేరే చెప్పింది. అయితే బాబా భాస్కర్.. వరుణ్ పేరు చెప్పి అత‌నికి 50 ల‌క్ష‌లు అవ‌స‌రం లేదు కాని టైటిల్ అవ‌సరం అని చెప్పాడు. మొత్తానికి శనివారం ఎపిసోడ్ హాట్ హాట్‌గా సాగ‌గా, 12 వారంలో ఎవ‌రు సేఫ్ అవుతారో, ఎవ‌రు ఎలిమినేట్ అవుతారో నేడు తెలియ‌నుంది.

5098
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles