'కిరాక్ పార్టీ' ప్రీ టీజ‌ర్ అదిరింది

Thu,January 18, 2018 02:46 PM
'కిరాక్ పార్టీ' ప్రీ టీజ‌ర్ అదిరింది

యంగ్ హీరో నిఖిల్ త‌న 15వ చిత్రంగా శరణ్ కొప్పిశెట్టి ద‌ర్శ‌క‌త్వంలో కిరాక్ పార్టీ అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. క‌న్నడ హిట్ చిత్రం కిరిక్ పార్టీ రీమేక్ కాగా, ఏకే ఎంట‌ర్ టైన్ మెంట్స్ బేన‌ర్ పై ఈ మూవీ రూపొందుతుంది. యువ దర్శకులు సుధీర్ వర్మ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందిస్తుండ‌గా, మరో యువ దర్శకుడు చందూ మొండేటి సంభాషణలు సమకూరుస్తున్నాడు. ఇటీవ‌ల ఈ చిత్రం ఫ‌స్ట్ లుక్ విడుద‌ల కాగా ఇది అభిమానుల‌ని ఎంత‌గానో అల‌రించింది. ఇక కొద్ది సేప‌టి క్రితం మూవీకి సంబంధించి ప్రీ టీజ‌ర్ విడుద‌ల చేసింది చిత్ర బృందం. ఈ ప్రీ టీజ‌ర్ ద్వారా జ‌న‌వ‌రి 22న సినిమాలోని తొలి పాట‌ని విడుద‌ల చేస్తున్నట్టు ప్ర‌క‌టించారు. ఈ మూవీ లో సంయుక్తా హెగ్డే .. సిమ్రాన్ పరీన్జా క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. అజ‌నీష్ లొక‌నాథ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. వెరైటీ క‌థాంశంతో ఈ మూవీ రూపొందుతుండ‌గా, ఈ సినిమా కూడా నిఖిల్ కి మంచి హిట్ అందిస్తుంద‌ని యూనిట్ భావిస్తుంది.

1902

data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS

Union Budget 2018