తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ‘కిరాక్ పార్టీ’ టీం

Tue,March 13, 2018 12:39 PM
Kirrak Party movie team visits tirumala today

తిరుమల: కిరాక్ పార్టీ హీరో నిఖిల్, హీరోయిన్ సంయుక్తా హెగ్డే, చిత్రయూనిట్, నటి ఈషారెబ్బా ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం సుప్రభాతం సేవ సమయంలో వారు స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. టీటీడీ అధికారులు వారికి దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులచే ఆశీర్వచనం అందించి, స్వామివారి తీర్ధప్రసాదాలు, పట్టువస్త్రాలను అందజేశారు. అనంతరం హీరో నిఖిల్ మాట్లాడుతూ కిరాక్ పార్టీ చిత్రం ఈనెల 16 వ తేదీన విడుదల అవుతున్న సందర్భంగా..సినిమా విజయం సాధించాలని కోరుతూ స్వామివారి ఆశీర్వచనం కోసం వచ్చినట్లు తెలిపాడు.

922
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS