అన్నీ భాష‌ల‌లో అద‌ర‌గొడ‌తున్న కింగ్ నాగ్‌..!

Sat,September 8, 2018 09:22 AM
King Nag Becoming Pan-India Actor

టాలీవుడ్ న‌వ‌మ‌న్మ‌ధుడు నాగార్జున ప్ర‌స్తుతం ఇండియాలోని అన్ని భాష‌ల‌లో న‌టించేందుకు స‌న్న‌ద్ధ‌మైన‌ట్టుగా క‌నిపిస్తుంది. శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో నానితో క‌లిసి దేవ‌దాస్ అనే మ‌ల్టీ స్టార‌ర్ చిత్రం చేసిన నాగార్జున బ్ర‌హ్మ‌స్త్రా అనే బాలీవుడ్ చిత్రంలోను న‌టిస్తున్నాడు. ఇక మ‌ల‌యాళ మెగాస్టార్ మోహ‌న్ లాల్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రంలోను నాగ్ ఓ ముఖ్య పాత్ర పోషించ‌నున్న‌ట్టు కొన్నాళ్ళుగా ప్ర‌చారం జ‌ర‌గుతూ వ‌స్తుంది.

క‌ట్ చేస్తే కోలీవుడ్ కి చెందిన బ‌హుముఖ ప్ర‌జ్ఞాశాలి ధనుష్ త్వ‌ర‌లో త‌న ద‌ర్శ‌క‌త్వంలో ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేయాల‌ని భావిస్తున్నాడ‌ట‌. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ తేనాండాళ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు , తమిళ భాషల్లో తెరకెక్కుతుంది. సీన్ రోనాల్డ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో శరత్ కుమార్, ఎస్ జె సూర్య ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా అదితి రావ్ హైదరి కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రంలో నాగార్జున ముఖ్య పాత్ర పోషించ‌నున్నాడ‌నే రూమ‌ర్ న‌డుస్తుంది. ఒకవేళ ఇవే క‌నుక నిజ‌మైతే నాగ్ కంప్లీట్ ఇండియ‌న్ యాక్ట‌ర్ అవడం ఖాయ‌మ‌ని ఆయ‌న అభిమానులు చెప్పుకొస్తున్నారు. నాగ్ న‌టించిన దేవదాస్ చిత్రం ఈ నెల‌లోనే విడుద‌ల కానుండ‌గా, అతి త్వ‌ర‌లో శ‌ర్వానంద్‌తో క‌లిసి మ‌రో మల్టీస్టార‌ర్ చేయ‌నున్న‌ట్టు టాక్. దీనిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది.

2235
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles