పవన్ సినిమాపై ఖుష్బూ ట్వీట్..

Sun,December 17, 2017 07:04 PM
పవన్ సినిమాపై ఖుష్బూ ట్వీట్..


హైదరాబాద్ : పవన్‌కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో అజ్ఞాతవాసి మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాలో అలనాటి అందాల నటి ఖుష్బూ కీలక పాత్రలో నటించింది. పవన్ మూవీపై ఇంట్రస్టింగ్ కామెంట్‌ను ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకుంది ఖుష్బూ. నేను ఎంతో కాలం నుంచి ఇటువంటి అవకాశం, పాత్ర కోసం ఎదురుచూస్తున్నా. ఇంత మంచి సినిమాలో అవకాశమిచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు కృతజ్ఞతలు అని ట్వీట్ చేసింది. దీంతోపాటు సినిమాలో తన రోల్‌కు సంబంధించిన ఓ ఫొటోను షేర్ చేసింది. ఖుష్బూ కుర్చీలో కూర్చొని సీరియస్ లుక్‌తో ఉండగా..పవన్ వెనకవైపు నిలుచుని ఉన్నాడు. ఇంట్రస్టింగ్‌గా ఉన్న ఈ ఫొటో ఏ సీన్‌కు సంబంధించిందో తెలుసుకోవాలంటే రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే మరీ. సంక్రాంత్రి కానుకగా అజ్ఞాతవాసి విడుదల కానుంది.

3251

More News

VIRAL NEWS