ఎప్పుడో సెట్స్ పైకి వెళ్ళిన తమన్నా చిత్రం రీసెంట్ చిత్ర షూటింగ్ పూర్తి చేసుకొని మే 31న విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్ స్పీడ్ పెంచారు. రీసెంట్గా టీజర్ విడుదల చేసి అంచనాలు పెంచిన యూనిట్ తాజాగా చిత్ర ట్రైలర్ విడుదల చేసింది. ఇందులోని సన్నివేశాలు సినిమాపై చాలా ఆసక్తిని కలిగిస్తున్నాయి. మూవీ మంచి హిట్ ఖాయమని నెటిజన్స్ సర్టిఫికెట్స్ ఇస్తున్నారు.
మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో చక్రి తోలేటి తెరకెక్కించిన చిత్రం ఖామోషీ. 2017లోనే సెట్స్ పైకి వెళ్ళిన ఈ చిత్రం పలు కారణాల వలన వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకి ఈ చిత్రాన్ని మే 31న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. చిత్రంలో ప్రభుదేవా, భూమిక, సంజయ్ సూరీ, మురళీ శర్మ ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. ప్రభాస్ అతిధి పాత్రలో కనిపించనున్నారట. చిత్రంలో ప్రభుదేవా సైకో పాత్రలో కనిపించి బయపెట్టించనున్నాడు. తమన్నా బధిర యువతిగా కనిపించనుంది. హారర్, థ్రిల్లర్ చిత్రంగా రూపొందిన ఈ మూవీకి యువన్ శంకర్ రాజా బాణీలు అందించారు. 