త‌మ‌న్నా చిత్రంలో సైకోగా ప్రభుదేవా.. గెస్ట్ పాత్ర‌లో ప్ర‌భాస్

Sat,May 11, 2019 08:49 AM
Khamoshi Official Teaser released

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా ప్ర‌ధాన పాత్ర‌లో చ‌క్రి తోలేటి తెర‌కెక్కించిన చిత్రం ఖామోషీ. 2017లోనే సెట్స్ పైకి వెళ్ళిన ఈ చిత్రం ప‌లు కార‌ణాల వ‌ల‌న వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. ఎట్ట‌కేల‌కి ఈ చిత్రాన్ని మే 31న విడుద‌ల చేస్తున్న‌ట్టు ప్ర‌కటించారు. చిత్రంలో ప్ర‌భుదేవా, భూమిక‌, సంజ‌య్ సూరీ, ముర‌ళీ శ‌ర్మ‌ ముఖ్య పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు. ప్ర‌భాస్ అతిధి పాత్ర‌లో క‌నిపించ‌నున్నార‌ట‌. తాజాగా చిత్రానికి సంబంధించిన టీజ‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో ప్ర‌భుదేవా సైకో పాత్ర‌లో బ‌య‌పెట్టిస్తున్నాడు. త‌మ‌న్నా బ‌ధిర యువ‌తిగా క‌నిపించ‌నుంది. హార‌ర్, థ్రిల్ల‌ర్ చిత్రంగా ఈ మూవీ రూపొందిన‌ట్టు తెలుస్తుండ‌గా, తాజాగా విడుద‌లైన టీజ‌ర్ మూవీపై భారీ అంచ‌నాలే పెంచింది. మీరు ఈ టీజ‌ర్‌పై ఓ లుక్కేయండి.

1971
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles