ఖైదీ నెం 150 రివ్యూ

Wed,January 11, 2017 07:41 AM

అభిమానుల ఎదురుచూపులకు బ్రేక్ పడింది. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ కలవరిస్తోన్న ఫ్యాన్స్ ని ఉత్సాహపరచేందుకు మెగాస్టార్ అన్ని హంగులతో అభిమానుల ముందుకు వచ్చాడు. ఇప్పటికే చిరు 150వ చిత్రం ఖైదీ నెం 150 బెనిఫిట్ షోస్ కొన్ని చోట్ల ప్రదర్శితం కాగా, మరి కొద్ది గంటలలో ఈ చిత్రం అన్ని థియేటర్స్ లో విడుదల కానుంది. అభిమానుల అంచనాలను మించేలా ఈ చిత్రం ఉందనే టాక్ బయటకు రావడంతో రాత్రి నుండే టిక్కెట్స్ కోసం థియేటర్స్ దగ్గర పడిగాపులు కాస్తున్నారు మెగాస్టార్ ఫ్యాన్స్.

ఇక ప్రముఖ ఎడిటర్, ఫిలిం క్రిటిక్ ఉమైర్ సింధు మరియు యూఏయి సెన్సార్ బోర్డ్ ఫిలిం మెంబర్స్ ఖైదీ నెం 150 చిత్రాన్ని తాజాగా వీక్షించారు. ఈ సినిమాకు సంబంధించిన రివ్యూని తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన ఉమైర్ సింధు ఈ చిత్రానికి 4/5 రేటింగ్ ఇచ్చారు. ఈ చిత్రం ఓ సోషల్ మెసేజ్ తో కమర్షియల్ ఫార్మాట్ లో అందంగా తెరకెక్కిందని ఉమైర్ తన రివ్యూలో పేర్కొన్నారు.

ఈ సినిమాకు సంబంధించి టెక్నికల్ పరంగా చూస్తే స్టోరీ లైన్ మరియు స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉన్నాయని చెప్పారు. రత్నవేలు సినిమాటోగ్రఫీ, దేవి శ్రీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మైండ్ బ్లోయింగ్ గా ఉంది. ఫస్ట్ హాఫ్ , సెకండ్ ఆఫ్ టెర్రిఫిక్ గా ఉన్నాయి. ఇక క్లైమాక్స్ ఫైటింగ్ మైండ్ బ్లోయింగ్. డైలాగ్స్ అదరగొట్టేశాయి. ప్రొడక్షన్ వాల్యూస్ మరియు కొరియోగ్రఫీ మరింత స్మార్ట్ గా ఉన్నాయి అంటూ ఉమైర్ తన పేజ్ లో రాసుకొచ్చారు.

ఇక చిరు పర్ ఫార్మెన్స్ విషయానికి వస్తే 60 ఏళ్ల వయసున్న చిరు 25 ఏళ్ల కుర్రాడిలా నటిస్తూ ఆశ్చర్యచకితుల్ని చేశాడట. వన్ మాన్ షో గా చిరు పర్ ఫార్మెన్స్ ఉంటే దీనికి తోడు కాజల్ అందాల ప్రదర్శన సినిమాకు చాలా ప్లస్ అయిందని అంటున్నారు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగుందంటూ కితాబిచ్చాడు. ఇక ప్రతినాయకుడి పాత్రలో కనిపించిన తరుణ్ అరోరా, ఐటెం సాంగ్ వేసిన లక్ష్మీ రాయ్ తమ పరిధిలో నటించి మెప్పించారు. కామియో రోల్ లో కనిపించిన చరణ్ అదరగొట్టేశాడు. అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు అనే సాంగ్ లో తన తండ్రితో స్టెప్పులు వేస్తూ అభిమానులచే కేరింతలు కొట్టించాడట.

ఇక దర్శకుడు వివి వినాయక్ విషయానికి వస్తే ఖైదీ నెం 150 చిత్రం రీమేక్ అనే భావన కలగకుండా ప్రతీ సీన్ ని తెలుగు ఆడియన్స్ మెచ్చే విధంగా తెరకెక్కించాడట. పైసా వసూల్ మూవీగా ఈ చిత్రం అనేక ట్విస్ట్ లతో అభిమానులకు కావలసిన అన్ని అంశాలతో పొందుపరచబడింది. చిరు కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా ఈ చిత్రం నిలుస్తోందని అంటున్నారు. మెగా ఫ్యాన్స్ కే కాదు సినీ లవర్స్ కూడా ఈ సినిమా చూసి ఎగిరి గంతేస్తారట. ఇక విమర్శకులు సైతం ఈ సినిమాపై తప్పక ప్రశంసలు కురిపించాల్సిందే అని అంటున్నారు.

తాను చెప్పినట్టుగానే మెగాస్టార్ సమపాళ్లలో అన్ని అంశాలను రంగరించి సంక్రాతి పండుగకు చక్కని వినోదాన్ని అందించేందుకు ఖైదీ నెం 150తో వచ్చాడని అంటున్నారు. ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తుందని సినీ పండితులు చెబుతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్ లో రికార్డ్ క్రియేట్ చేయగా, ఈ చిత్రం వంద కోట్ల క్లబ్ లో తప్పక చేరుతుందని అంటున్నారు. 2017 మోస్ట్ ఎవైటెడ్ మూవీగా వచ్చిన ఖైదీ నెం 150 బ్లాక్ బస్టర్ హిట్ అంటూ ప్రతి ఒక్కరు చిరంజీవి పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

9750

More News

మరిన్ని వార్తలు...