తేజూ మూవీ సెట్స్ లో ఖైదీ సెలబ్రేషన్స్

Fri,January 12, 2018 04:42 PM
khaidi no 150 completes 1 year

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ చిత్రం ఖైదీ నెం 150 మూవీ జనవరి 11, 2017 న సంక్రాంతి కానుకగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ సునామి సృష్టించింది. వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నిన్నటితో ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఇంటెలిజెంట్ మూవీ సెట్స్ లో సెలబ్రేషన్స్ జరుపుకున్నాడు వినాయక్. ప్రస్తుతం సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ తో వినాయక్ ఇంటిలిజెంట్ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీని ఫిబ్రవరిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఇంటిలిజెంట్ మూవీ సెట్ లో తేజు చేతుల మీదుగా కేక్ కట్ చేయించి వినాయక్ ఖైదీ నెంబర్ 150 సెలబ్రేషన్స్ జరుపుకోవడం విశేషం.

సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా సి.కె.ఎంటర్టైన్మెంట్స్ ప్రై. లిమిటెడ్ పతాకంపై సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ నిర్మిస్తున్న భారీ చిత్రం ఇంటిలిజెంట్ ఇటీవలే మస్కట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఫిబ్రవరి 9న చిత్రాన్ని రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. తేజూ కెరీర్ లో ఈ చిత్రం మైల్ స్టోన్ గా నిలుస్తుందని నిర్మాతలు అంటున్నారు. లావణ్య త్రిపాఠి ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుండగా, నాజర్, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, ఆకుల శివ, కాశీ విశ్వనాథ్, ఆశిష్ విద్యార్థి, షాయాజీ షిండే తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తమన్ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే మూవీ ఫస్ట్ లుక్ విడుదల కానుందని సమాచారం.1416
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS