కేజీఎఫ్‌2 లో న‌టించాల‌ని ఉందా, ఇంకెందుకు ఆల‌స్యం !

Mon,April 22, 2019 08:58 AM
KGF Chapter2 Audition at bengaluru

ఎలాంటి ఆర్బాటాలు లేకుండా సైలెంట్‌గా వ‌చ్చి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ హిట్ కొట్టిన చిత్రం కేజీఎఫ్‌. పీరియ‌డ్ గ్యాంగ్ స్ట‌ర్ డ్రామాగా తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని తెలుగు, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల‌లో విడుద‌ల చేశారు. అంత‌టా ఈ చిత్రానికి భారీ ఆద‌ర‌ణ ల‌భించింది. శాండ‌ల‌వుడ్ చ‌రిత్రలో సరికొత్త రికార్డు నెల‌కొల్పిన ఈ చిత్రానికి సీక్వెల్ ఇటీవ‌ల పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభించారు. త్వ‌ర‌లో చిత్రీక‌ర‌ణ మొద‌లు పెట్ట‌నున్నారు. అయితే చిత్రంలో న‌టించేందుకు ఆస‌క్తిగ‌ల వారు ఆడిష‌న్స్‌లో పాల్గొన‌వ‌చ్చని పోస్ట‌ర్ ద్వారా తెలిపారు మేక‌ర్స్‌. 8 నుండి 16 సంవ‌త్స‌రాల వ‌య‌స్సున్న పిల్ల‌లు, 25 సంవ‌త్స‌రాల పైబ‌డిన పురుషులు కావాలంటూ పోస్ట‌ర్‌లో తెలిపారు. అయితే ఆడిష‌న్‌కి వ‌చ్చే ముందు నిమిషం పాటు ఉన్న ఏదైన డైలాగ్‌ని నేర్చుకొని రావాల‌ని సూచించారు. ఆడిష‌న్ జ‌రిగే స్థ‌లం యొక్క అడ్రెస్ కూడా పోస్ట‌ర్‌లో పొందుప‌ర‌చారు. మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం రికార్డులు సృష్టించిన చిత్ర సీక్వెల్‌లో మీరు భాగం కండి.

కర్ణాటక రాష్ట్రంలో జరిగిన అక్రమ మైనింగ్‌ నేపథ్యంలో కేజీఎఫ్ చిత్రాన్ని ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్‌ తెరకెక్కించారు. యువ నటుడు యష్‌ ఈ చిత్రంలో హీరోగా నటించారు. సీక్వెల్‌లోను ఆయ‌న హీరోగా న‌టించ‌నున్నాడు. ముఖ్య పాత్ర‌ల‌లో ర‌మ్య‌కృష్ణ‌, సంజ‌య్ ద‌త్‌ని తీసుకోవాల‌ని చిత్ర యూనిట్ భావిస్తుంద‌ట‌. ఇక మొదటిభాగంలో చేసిన రవిశంకర్ .. అదే పాత్రలో రెండవ భాగంలోను కొనసాగుతాడట. కాకపోతే అత‌ని పాత్ర‌ని మ‌రింత ప‌వ‌ర్‌ఫుల్‌గా రూపొందించ‌నున్నార‌ట‌. ఇక బాలీవుడ్‌ నటి రవీనా టాండన్‌, క‌న్న‌డ రియ‌ల్ స్టార్ ఉపేంద్ర‌ కూడా ఇందులో నటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావల్సి ఉంది.

2377
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles