కంగనారనౌత్‌కు లీగల్ నోటీసులు..!

Fri,May 19, 2017 09:24 PM
కంగనారనౌత్‌కు లీగల్ నోటీసులు..!


ముంబై: బాలీవుడ్ నటి కంగనారనౌత్ మరో వివాదంలో చిక్కుకుంది. ప్రముఖ నిర్మాత కేతన్ మెహతా కంగనారనౌత్‌కు లీగల్ నోటీసులు జారీచేసినట్లు బాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. కంగనా ప్రస్తుతం రాణీ ఝూన్సీ లక్ష్మీభాయ్ జీవిత గాథ ఆధారంగా క్రిష్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘మణికర్ణిక’ లో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఝూన్సీ రాణి జీవిత ఇతివృత్తంతో తీయనున్న ‘హైజాకింగ్’ సినిమాలో నటించాల్సిన కంగనా, అదే కథతో తెరకెక్కుతున్న మణికర్ణిక సినిమాలో నటించడంపై నిర్మాత కేతన్ మెహతా లీగల్ నోటీసులు జారీ జారీచేశారు.

ఈ విషయమై కేతన్ మెహతా మాట్లాడుతూ ఒకే కథతో సినిమా తీస్తుండటంతో మేము లీగల్ నోటీసులు జారీచేశాం. కానీ ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదు. మేము పెట్టుకున్న నమ్మకాన్ని కంగనా వమ్ము చేసింది. మేము రెడీ చేసుకున్న కథతో సినిమా తీయడం సరైంది కాదు. దీనిపై న్యాయపోరాటాన్ని కొనసాగిస్తామన్నారు.

883

More News

VIRAL NEWS