ట్రైల‌ర్‌తో అంచ‌నాలు పెంచిన 'కేస‌రి'

Thu,February 21, 2019 11:33 AM

బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్ న‌టిస్తున్న తాజా చిత్రం కేస‌రి. ఈ చిత్రంలో హ‌ల్వీద‌ర్ ఇషార్ సింగ్ అనే పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు అక్ష‌య్. 1897లో బ్రిటీష్ ఇండియన్ బృందాలకు, ఆఫ్ఘనిస్థాన్ బృందాలకు మధ్య జరిగిన సరాగర్హి యుద్ధం నేపథ్యంలో ఈ చిత్రం తెర‌కెక్కింది . అనురాగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అక్షయ్ సిక్కుగా కనిపించనున్నాడు. కేప్ ఆఫ్ గుడ్ హోప్ ఫిలింస్ మ‌రియు ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో క‌థానాయిక‌గా ప‌రిణితీ చోప్రా న‌టిస్తుంది. ఇటీవ‌ల చిత్రానికి సంబంధించి విడుద‌లైన టీజ‌ర్ సినిమాపై ఉన్న అంచ‌నాల‌ని పీక్ స్టేజ్‌కి తీసుకెళ్లింది. ఇక తాజాగా చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో స‌న్నివేశాలు రోమాలు నిక్క‌పొడుచుకునేలా చేస్తున్నాయి. ‘నేను తన బానిసనని, భారతీయులంతా మూర్ఖులని ఓ బ్రిటిష్‌ వ్యక్తి నాతో అన్నాడు. అలాంటివారికి బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది’ అంటూ అక్షయ్‌ చెప్పే డైలాగ్‌తో ట్రైలర్‌ మొదలైంది. 21 మంది సిక్కులు, ప‌దివేల మంది ఆక్ర‌మ‌ణ దారుల‌కి మ‌ధ్య జ‌రిగిన యుద్ధంకి సంబంధించిన‌దే ఈ చిత్రం అని నిర్మాత‌లు తెలిపారు. కేస‌రి చిత్రంలో న‌టించినందుకు నా హృద‌యం గ‌ర్వంతో ఉప్పొంగిపోతుందని అక్ష‌య్ అన్నారు. మార్చి 21న విడుద‌ల కానున్న ఈ చిత్ర ట్రైల‌ర్‌పై మీరు ఓ లుక్కేయండి.


2083
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles