కేర‌ళ ప్ర‌భుత్వం నుండి బన్నీకి ఆహ్వానం

Tue,November 6, 2018 11:28 AM
kerala government invites Stylish Star

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్‌కి తెలుగులోనే కాదు మ‌ల‌యాళంలోను భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగ‌తి తెలిసిందే. కేర‌ళ‌లో అల్లు అర్జున్ సినిమా రిలీజ్ అయిందంటే అక్క‌డి అభిమానులు ఎగ‌బ‌డి మ‌రి సినిమా చూస్తుంటారు. ఇటీవ‌ల కేర‌ళ‌లో వ‌చ్చిన వ‌ర‌ద బీభ‌త్సానికి ఎందరో నిరాశ్ర‌యులు కాగా, వారికి త‌న వంతు సాయంగా రూ.25 లక్షల ఆర్థిక సాయం అందించి గొప్ప మ‌న‌సు చాటుకున్నాడు. దీంతో రియ‌ల్ హీరోగాను బ‌న్నీ మ‌ల‌యాళ అభిమానుల మ‌న‌సుల‌లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నాడు. అయితే నవంబర్ 10న కేర‌ళ ప్ర‌భుత్వం నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్ నిర్వ‌హిస్తుంది. అలప్పిలోని మాడ లేక్‌లో జరగనున్న ఈ పోటీలో మొత్తం 81 బోట్లు తలపడతాయని సమాచారం.ఈ పోటీల‌కి బ‌న్నీని ముఖ్య అతిధిగా ఆహ్వానించారు. చివ‌రిగా నా పేరు సూర్య‌.. నా ఇల్లు ఇండియా అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన బ‌న్నీ వ‌చ్చే నెల‌లో త్రివిక్ర‌మ్‌తో క‌లిసి క్రేజీ ప్రాజెక్ట్ చేయ‌నున్నాడ‌ట‌.

2642
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS