వెండితెర‌పై కేర‌ళ క‌న్నీటిగాథ‌

Sun,September 23, 2018 11:18 AM
kerala floods on silver screen

కొన్ని రోజుల క్రితం కురిసిన భారీ వ‌ర్షాల‌కి కేర‌ళ రాష్ట్రం అత‌లాకుత‌లం అయిన సంగ‌తి తెలిసిందే. వ‌ర‌ద‌ల వ‌ల‌న ఎందరో నిరాశ్ర‌యుల‌య్యారు. వారిని ఆదుకునేందుకు సినీ, రాజ‌కీయ‌, క్రీడా రంగానికి చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు విరాళాలు ఇచ్చారు. ఇప్పుడు వ‌ర‌ద‌ల వ‌ల‌న కేర‌ళ రాష్ట్రంలో ఎంత భీబ‌త్సం జ‌రిగింద‌నేది వెండితెర‌పై చూపించేందుకు మ‌ల‌యాళ ద‌ర్శ‌కుడు జూడ్ ఆంటోని జోసెఫ్ ముందుకు వ‌చ్చాడు. కొన్ని స్వ‌చ్చంద సేవాసంస్థ‌లు వ‌ర‌ద‌లపై ఇన్‌స్పైరింగ్ వీడియో చేయ‌మ‌ని ఆయ‌న‌ని సంప్ర‌దించ‌గా, సినిమా తీస్తే బాగుంటుంద‌నే ఆలోచ‌న త‌న‌కు వ‌చ్చింద‌ని ద‌ర్శ‌కుడు చెప్పాడు. తర్వాత తరాలకు ఎన్నో ప్రేరణ తెప్పించే కథలును ఈ వరదల నేపథ్యంలో చెప్పాలి అనిపించింది. ఆయితే బాధితుల సహాయార్థాల నిమిత్తం పాల్గొన్న ప్రతి ఒక్కరూ నా దృష్టిలో సూపర్‌ హీరోలే. ఈ చిత్రానికి చాలా గ్రాఫిక్స్ పని ఉంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నామని దర్శకుడు తెలిపారు. వరదల నేపథ్యంలో తీయబోయ్యే సినిమాకు ‘2043 ఫీట్‌’ అనే పేరును కూడా అనౌన్స్ చేశారు జూడ్‌ ఆంటొనీ జోసెఫ్‌. ముఖ్యంగా ఈ చిత్రంలో వ‌ర‌ద నీరు చూట్టూ పొంచి ఉండం, స‌రైన వ‌స‌తి లేక ఇబ్బందులు ప‌డ్డ ప‌రిస్థితులు, కాపాడే వారు లేని స‌మ‌యంలో వారు ప‌డిన ఇబ్బందులు, ఎదుర్కొన్న సంఘ‌ట‌న‌ల‌ని ప్ర‌ధానంగా చూపించ‌నున్న‌ట్టు తెలుస్తుంది.

1548
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles