వరద బాధితులకు సాయం చేయడానికి పెళ్లి వాయిదా వేసుకున్న నటుడు

Tue,August 21, 2018 11:20 AM
Kerala Actor Rajeev Pillai postponed his wedding to help flood victims

వరదలతో అతలాకుతలమైన కేరళకు సాయం చేయడానికి దేశవిదేశాల నుంచి ఎంతో మంది ముందుకు వస్తున్నారు. ఇలా ఓ మళయాల నటుడు కూడా వరద బాధితులకు సాయం చేయడానికి ఏకంగా తన పెళ్లినే వాయిదా వేసుకున్నాడు. ఆ నటుడి పేరు రాజీవ్ పిైళ్లె. ఈ విషయాన్ని అతని కోస్టార్ రిచా చద్దా తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో వెల్లడించింది. ఈ ఇద్దరూ షకీలా అనే మూవీలో కలిసి నటిస్తున్నారు. తన సొంతూరు నన్నూర్ వరదల్లో చిక్కుకోవడంతో రాజీవ్ తన పెళ్లి వాయిదా వేసుకోవాలని నిర్ణయించాడు. ఇది రిచాను ఎంతగానో ఆకట్టుకుంది. మా ఫ్రెండ్, కోస్టార్ రాజీవ్ పిైళ్లె మూడు రోజుల కిందట జరగాల్సిన తన పెళ్లిని వాయిదా వేసుకున్నాడు. తన సొంతూరులో వరదల్లో చిక్కుకున్నవారికి సాయం చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నాడు. స్థానికులతో కలిసి అతడు పడవలను తయారుచేసి అక్కడి వాళ్లను రక్షిస్తున్నాడు అని రిచా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఇది చూసి అతనో రియల్ హీరో అంటూ ఇంటర్నెట్ ప్రశంసలు కురిపించింది. రాజీవ్ పిైళ్లె ఇంజినీరింగ్ విద్యార్థి అయిన అజితను పెళ్లి చేసుకోబోతున్నాడు. కేవలం పది మంది అతిథుల మధ్య పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఇప్పుడా పెళ్లిని వచ్చే నెలకు వాయిదా వేశాడు.

4003
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles