'పెంగ్విన్‌'గా రాబోతున్న కీర్తి సురేష్‌

Thu,October 17, 2019 12:24 PM

గ‌త ఏడాది ఇటు తెలుగు, అటు త‌మిళంలో వ‌రుస‌ సినిమాల‌తో అల‌రించిన కీర్తి సురేష్ ఈ ఏడాది ఒక్క సినిమాతోను ప‌ల‌క‌రించ‌లేదు. కాకపోతే ఆమె న‌టిస్తున్న ప‌లు ప్రాజెక్టులు మాత్రం సెట్స్‌పై ఉన్నాయి. నరేంద్రనాధ్ దర్శకుడిగా రూపొందుతున్న‌ మిస్ ఇండియా అనే ఫీమేల్ సెంట్రిక్ చిత్రంలో న‌టిస్తున్న కీర్తి హిందీ, త‌మిళ భాష‌ల‌లోను ప‌లు సినిమాలు చేస్తుంది. నగేష్ కుకునూర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తుండ‌గా, దిల్‌రాజు సమర్పణలో సుధీర్‌చంద్ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆది పినిశెట్టి, జగపతిబాబు కీలక పాత్రల్ని పోషిస్తున్నారు. రీసెంట్‌గా చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. బంజారా అమ్మాయిగా కీర్తి లుక్ ఆక‌ట్టుకునేలా ఉంది.


ఇక ద‌ర్శ‌కుడు కార్తీక్ సుబ్బ‌రాజు నిర్మిస్తున్న ఉమెన్ సెంట్రిక్ చిత్రంలో కీర్తి సురేష్ ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్న విష‌యం విదిత‌మే. కీర్తి 24వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాకి సంతోష్ నారాయ‌ణ‌న్ సంగీతం అందిస్తున్నారు. ఈశ్వ‌ర్ కార్తీక్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. వ‌చ్చే ఏడాది చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తెచ్చే ప్ర‌ణాళిక‌లు వేస్తున్నారు. అయితే ఈ రోజు కీర్తి సురేష్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా చిత్ర టైటిల్ రివీల్ చేశారు. పెంగ్విన్ అనే టైటిల్‌తో ఈ చిత్రం తెలుగు, త‌మిళంతో పాటు ప‌లు భాష‌ల‌లో విడుద‌ల కానుంది. పోస్ట‌ర్‌లో కీర్తి సురేష్ గ‌ర్బ‌వ‌తిగా క‌నిపిస్తుంది. ఈ చిత్రంలో త‌న‌ది ఛాలెంజింగ్ రోల్ అని అంటున్నారు. మరోవైపు కీర్తి మైదాన్ అనే సినిమాతో బాలీవుడ్ ఆరంగేట్రం చేయ‌నుంది. మ‌ర‌క్క‌ర్‌: అర‌బిక‌ద‌లింతే సింహం అనే మ‌ల‌యాళ చిత్రంలోను కీర్తి న‌టిస్తుంది.1345
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles