స్పీడు పెంచిన కీర్తి సురేష్‌

Sun,April 28, 2019 07:45 AM
keerthy suresh with new combination

కీర్తి సురేష్ ఇటు సౌత్‌, అటు నార్త్ సినిమాల‌తో ఫుల్ బిజీ అయింది. మ‌హాన‌టి చిత్రం త‌ర్వాత ప‌లు త‌మిళ సినిమాలు (‘సీమరాజా’, ‘స్వామి 2’, ‘పందెం కోడి 2’, సర్కార్‌) చేసిన కీర్తి బాలీవుడ్ సినిమాలో న‌టించేందుకు ఓకే చెప్పింది. బోనీ క‌పూర్ నిర్మాణంలో రూపొంద‌నున్న ఈ చిత్రంలో అజ‌య్ దేవ‌గ‌ణ్ ప్ర‌ధాన పాత్ర పోషించనున్నాడు. ప్ర‌స్తుతం ఈ ప్రాజెక్ట్ సెట్స్ పై ఉంది. ఇక తెలుగులోను కీర్తి త‌న జోరు పెంచింది. నగేష్‌ కుకునూర్‌ దర్శకత్వంలో స్పోర్ట్స్‌ రొమాంటిక్‌ కామెడీ కథతో రూపొందుతున్నచిత్రం చేస్తుంది కీర్తి. ఇందులో ఆది పినిశెట్టి, సీనియర్‌ నటుడు జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సుధీర్‌ చంద్ర నిర్మిస్తున్నారు. డిజైనర్‌ శ్రావ్య వర్మ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇ.శివప్రకాష్‌ సమర్పకుడు. వికారాబాద్‌, పుణెల్లో కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడు న‌గేష్ తెలుగు తెర‌కి ప‌రిచ‌యం అవుతున్నారు. సెప్టెంబ‌ర్‌లో ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తేనున్న‌ట్టు స‌మాచారం. మ‌ల‌యాళంలోను కీర్తి సురేష్ ఓ చిత్రం చేస్తుంది.

1743
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles