సావిత్రి లుక్‌లో అచ్చు గుద్దిన‌ట్టు ఉన్న కీర్తి సురేష్‌

Sun,May 6, 2018 11:40 AM
Keerthy Suresh same like as savitri

తెలుగు తెరపై చెరగని ముద్ర వేసుకున్న అందాల తార సావిత్రి జీవిత నేపథ్యంలో మహానటి సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 9న విడుద‌లయ్యేందుకు సిద్ధ‌మైంది. ఈ క్ర‌మంలో మూవీపై మ‌రింత ఆస‌క్తి క‌లిగించేందుకు సావిత్రి పాత్ర‌లో కీర్తి సురేష్ లుక్‌కి సంబంధించి ప‌లు పోస్ట‌ర్స్ విడుద‌ల చేస్తున్నారు. తాజాగా కీర్తి సురేష్ ఫోటో ఒక‌టి సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. అచ్చం సావిత్రి లాగే అంతలా ఒదిగిపోయిన‌ కీర్తి ఫోటో చూసి అభిమానులు మెస్మ‌రైజ్ అవుతున్నారు. నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.

అచ్చం సావిత్రిలా ఉన్న‌కీర్తి ఫోటోకి స‌మంత చాలా బాగుంది అనే కామెంట్ పెట్టింది. కారెక్టర్ల విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకున్న నాగ్ అశ్విన్.. కీర్తి సురేష్‌ని అచ్చం సావిత్రిలాగే మలిచేశాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి చాలా లుక్స్ ఆకట్టుకున్నాయి. చిత్రంలో మ‌ధుర వాణి పాత్రని స‌మంత పోషించ‌గా, జెమినీ గ‌ణేష‌న్‌గా దుల్క‌ర్ స‌ల్మాన్‌, ఎల్వీప్ర‌సాద్‌గా అవ‌స‌రాల, కేవి రెడ్డిగా క్రిష్ క‌నిపించ‌నున్నారు. అయితే లుక్ పరంగా సావిత్రిని గుర్తుకి తెస్తున్న‌ కీర్తి సురేష్, అసమాన్య నటనతో మహానటిగా గుర్తింపు తెచ్చుకున్న సావిత్రిలా నటించి మెప్పించగలదా లేదా అనేది సస్పెన్స్ . ఈ సినిమాలో కీర్తి తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకుంది. తమిళంలో ఈ చిత్రం ‘నడిగర్ తిలగమ్’ అనే టైటిల్ తో విడుదల కానుంది.

4328
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles