శ్రీదేవి కూతురితో ముంబైలో చ‌క్క‌ర్లు కొడుతున్న మ‌హాన‌టి

Sun,April 21, 2019 08:00 AM

అభిన‌వ న‌టి సావిత్రి జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్కిన మ‌హాన‌టి చిత్రంలో సావిత్రిగా న‌టించి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న అందాల భామ కీర్తి సురేష్‌. ఈ చిత్రంలో అచ్చం సావిత్రి వలే హావభావాలు ప‌లికిస్తూ ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదాన్ని అందించింది. రీసెంట్ మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన స‌ర్కార్ చిత్రంలో విజ‌య్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా న‌టించింది. ఈ చిత్రంలో కీర్తి న‌ట‌న‌కి ప్ర‌శంస‌లు ల‌భించాయి. ప్ర‌స్తుతం బ‌ధాయి హో ఫేం అమిత్ శ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న చిత్రంలో కీర్తి సురేష్ న‌టిస్తుంది. బోనీ కపూర్ నిర్మించ‌నున్న ఈ చిత్రంతో కీర్తి బాలీవుడ్‌లోకి అడుగుపెడుతుంది. లేడీ ఓరియెంటెడ్ మూవీగా ఈ చిత్రం ఉండ‌నున్న‌ట్టు టాక్. అయితే ముంబైలో కీర్తి, శ్రీదేవి క‌లిసి చక్క‌ర్లు కొడుతుండ‌గా, ఒకానొక సంద‌ర్భంలో వారిరివురు క‌లిసి ఫోటోకి ఫోజులిచ్చారు . ఈ ఫోటో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చక్క‌ర్లు కొడుతుంది. శ్రీదేవి కూతురు జాన్వీ గ‌తంలో కీర్తి సురేష్‌కి తాను ఫ్యాన్ అని, త‌న న‌ట‌నే అంటే చాలా ఇష్ట‌మ‌ని చెప్పిన విష‌యం తెలిసిందే. జాన్వీ ప్ర‌స్తుతం ఐఏఎఫ్ విమానం నడిపిన తొలి మహిళా పైలట్ గుంజన్ సక్సేనా బయోపిక్‌లో న‌టిస్తుంది. దీంతోపాటు కరణ్‌జోహార్ తెరకెక్కిస్తున్న పీరియాడిక్ డ్రామా ‘తక్త్‌’ కూడా చేస్తుంది.

9662
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles