కీర్తి సురేష్ మరో భారీ ప్రాజెక్ట్ ఆఫర్ కొట్టేసిందిగా..!

Wed,January 3, 2018 04:56 PM
Keerthy Suresh heroine for vijay 62

కెరీర్ లో స్లో అండ్ స్టడీగా సినిమాలు చేస్తూ వెళుతున్న అందాల భామ కీర్తి సురేష్. తెలుగు, తమిళంలో కీర్తి భారీ ప్రాజెక్టులే చేస్తుంది. రీసెంట్ గా పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన అజ్ఞాతవాసి చిత్రంలో లీడ్ రోల్ పోషించింది. ఈ మూవీ జనవరి 10న విడుదల కానుంది. ఇక ఇప్పుడు విజయ్ 62వ సినిమాలో కథానాయికగా నటించే అవకాశం అందుకుంది కీర్తి సురేష్. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ 62వ సినిమా తెరకెక్కనుండగా, సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని రూపొందించనుంది. గిరీష్ గంగాధరన్ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నాడు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్ గా, టీ సంతానం ఆర్ట్ డైరెక్టర్ గా ఉంటారు. ఇక ఏఆర్ రెహమాన్ చిత్రానికి సంగీతం అందిస్తారని తెలుస్తుంది. మిగతా టీంని త్వరలోనే ఎంపిక చేసి ఎనౌన్స్ చేయనున్నారు మూవీ మేకర్స్.3491
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS