బయోపిక్ రూమర్లను కొట్టిపారేసిన హీరోయిన్

Wed,May 16, 2018 02:59 PM
Keerthy suresh denies rumours on jayalalitaa Biopic

టాలీవుడ్ హీరోయిన్ కీర్తిసురేశ్ లీడ్ రోల్‌లో తెరకెక్కిన మహానటి చిత్రం బాక్సాపీస్ వద్ద సూపర్‌హిట్ టాక్‌తో ప్రదర్శించబడుతున్న విషయం తెలిసిందే. సావిత్రి జీవితకథ ఆధారంగా వచ్చిన ఈ చిత్రంలో కీర్తిసురేశ్ నటనకు అన్ని వర్గాల ప్రశంసలు లభించాయి. ఇదిలా ఉంటే సావిత్రి పాత్రలో జీవించిన కీర్తిసురేశ్ ప్రముఖ నటి, దివంగత తమిళనాడు మాజీ సీఎం జయలలిత బయోపిక్‌లో నటిస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను కీర్తిసురేశ్ కొట్టిపారేసింది. కీర్తి సురేశ్ నిన్న తిరుమల శ్రీవారిని సందర్శించి మొక్కులు చెల్లించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ..జయలలిత బయోపిక్ గురించి తనతో ఎవరు మాట్లాడటం కానీ, ఏ టీం కాని తనను సంప్రదించడం కానీ జరుగలేదని చెప్పింది. కీర్తిసురేశ్ ప్రస్తుతం విజయ్, విశాల్, విక్రమ్ వంటి స్టార్ హీరోల సినిమాలతో బిజీగా ఉంది.

2414
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles