బాలీవుడ్‌లో అడుగుపెట్ట‌నున్న మ‌హాన‌టి..!

Sun,March 3, 2019 07:35 AM
Keerthy Suresh bollywood entry confirmed

అభిన‌వ న‌టి మ‌హాన‌టి సావిత్రి జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్కిన మ‌హాన‌టి చిత్రంలో సావిత్రిగా న‌టించి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న అందాల భామ కీర్తి సురేష్‌. ఈ చిత్రంలో అచ్చం సావిత్రి వలే హావభావాలు ప‌లికిస్తూ ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదాన్ని అందించింది. ప్ర‌స్తుతం త‌మిళంలో బిజీ అయిన కీర్తి సురేష్ బాలీవుడ్‌లోను అడుగుపెట్ట‌నుంద‌ని అంటున్నారు. బ‌ధాయి హో ఫేం అమిత్ శ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా తెర‌కెక్క‌నుండ‌గా,ఈ చిత్రం లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా ఉంటుంద‌ట‌. ఇందులో లీడ్ రోల్ కోసం ప‌లువురిని ప‌రిశీలించి చివ‌రికి కీర్తిని ఓకే చేశార‌ని బాలీవుడ్ టాక్‌. బోని క‌పూర్ నిర్మాణంలో ఈ చిత్రం రూపొంద‌నున్న‌ట్టు టాక్‌. మ‌రి ఈ ప్రాజెక్ట్ పై పూర్తి క్లారిటీ ఎప్పుడు వ‌స్తుందో చూడాలి.

1375
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles