మ‌హాన‌టిలా కీర్తి సురేష్ ఎలా మారిందంటే..!

Thu,July 5, 2018 11:36 AM

అభిన‌వ నేత్రి మ‌హాన‌టి సావిత్రి జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్కిన చిత్రం మ‌హాన‌టి. ఇందులో కీర్తి సురేష్ ప్ర‌ధాన పాత్ర పోషించింది. సావిత్రి పేరు స్ఫురణకు రాగానే ఓ నిర్మలమైన తేజోమయరూపం కనులముందు కదలాడుతుంది. తెలుగు సినిమా స్వర్ణయుగం నుంచి నేటి వరకు అసమాన నటనకు, అద్వితీయ సౌందర్యానికి, అచ్చమైన తెలుగందానికి ప్రతీక సావిత్రి. ఆమె అభినయం గురించి ఎంత చెప్పినా చర్విత చరణమే అవుతుంది. మ‌రి ఆ మ‌హాన‌టి పాత్ర‌ని పోషించ‌డం అంటే క‌త్తి మీద సామే. అయిన‌ప్ప‌టికి దీనిని ఒక దీక్ష‌గా తీసుకొని సావిత్రి పాత్ర‌లో అస‌మాన ప్ర‌తిభ క‌న‌బ‌రిచింది కీర్తి సురేష్‌. ఆమె న‌ట‌నకి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ల‌బించాయి. అయితే సావిత్రిలా మార‌డానికి కీర్తి ఎన్ని క‌ష్టాలు ప‌డిందో ఓ వీడియో ద్వారా చూపించారు మేక‌ర్స్‌. జూలై 3,2017 తొలి ప్రోస్థెటిక్ మేక‌ప్ టెస్ట్ చేసిన టీం జూలై 11,2017న మ‌రో ప్రోస్థెటిక్ టెస్ చేశారు. వీఎఫ్ఎక్స్‌తో క‌నుబొమ్మ‌ల క‌రెక్ష‌న్ చేశారు. ఒక్క సావిత్రి పాత్ర కోసం 115 జ‌త‌ల కాస్ట్యూమ్స్‌ని వాడారు. మొత్తానికి కీర్తి సురేష్ ప‌డిన క‌ష్టానికి మంచి ఫ‌లితం ల‌భించింది. సావిత్రి పాత్ర‌లో లీన‌మైన కీర్తి షూటింగ్ చివ‌రి రోజు క‌న్నీటి ప‌ర్యంత‌మైన సంగ‌తి తెలిసిందే. నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌హాన‌టి చిత్రం తెర‌కెక్కింది. తాజాగా విడుద‌లైన కీర్తి సురేష్ మేకొవ‌ర్ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.

3554
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles