తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కీర్తిసురేశ్

Tue,May 15, 2018 10:45 AM


తిరుమల : మహానటి హీరోయిన్ కీర్తిసురేశ్ ఇవాళ తిరుమలను సందర్శించింది. కీర్తిసురేశ్ తిరుమల శ్రీవారిని వీఐపీ విరామసమయంలో దర్శించుకున్నారు. ఉదయం స్వామివారికి జరిగే నైవేద్య విరామ సమయంలో స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. టీటీడీ ఆలయ అధికారులు దగ్గరుండి కీర్తి సురేశ్ కు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం కీర్తిసురేశ్ కు ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదశీర్వచనం అందించి, స్వామి వారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం కీర్తిసురేశ్ ను పట్టువస్త్రంతో సత్కరించారు. ఈ సందర్భంగా కీర్తి మీడియాతో మాట్లాడుతూ..మహానటి సావిత్రి జీవిత చరిత్ర చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. మహానటి సినిమా విజయవంతం కావడంతో స్వామివారి దర్శనానికి వచ్చినట్లు కీర్తి చెప్పారు.

3853
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles