కీర్తి సురేష్ నోట తెలుగు మాట‌

Mon,November 27, 2017 10:59 AM
keerthi suresh says telugu dialogues for pawan 25

ఇప్పుడు వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్న మ‌ల‌యాళీ భామ కీర్తి సురేష్ తొలిసారి తెలుగు డ‌బ్బింగ్ చెప్పింది. నేను శైల‌జ చిత్రంతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మ‌డు ప్ర‌స్తుతం మ‌హాన‌టి, ప‌వ‌న్ 25వ సినిమా చేస్తుంది. ప‌వ‌ర్ స్టార్ స‌ర‌స‌న న‌టించే ఆఫ‌ర్ ఈ అమ్మ‌డికి రావ‌డంతో ఎగిరి గంతేసినంత ప‌ని చేసింది. అయితే ఈ సినిమా కోసం తొలిసారి తెలుగు డ‌బ్బింగ్ చెబుతుంది కీర్తి. త‌న ట్విట్ట‌ర్ ద్వారా ఈ విష‌యాన్ని చెబుతూ డ‌బ్బింగ్ రూమ్‌లో కూర్చొని దిగిన ఫోటోని షేర్ చేసింది. ఇందులో స్క్రీన్‌పై ప‌వ‌న్, కీర్తి సురేష్ క‌నిపిస్తున్నారు. గ‌తంలో ప‌ర‌భాషా భామ‌లు రకుల్‌ప్రీత్‌ సింగ్‌, తాప్సి, నిత్యామేనన్‌, తమన్నా తదితరులు తమ పాత్రలకు సొంతంగా డబ్బింగ్‌ చెప్పుకున్నారు.హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌. రాధాకృష్ణ నిర్మిస్తున్న ప‌వ‌న్ 25వ‌ సినిమాలో అను ఎమ్మాన్యుయేల్ మ‌రో క‌థానాయిక‌. సంక్రాంతి కానుక‌గా ఈ చిత్రాన్ని విడుదల చేయ‌నున్నారు. మ‌రి కొద్ది నిమిషాల‌లో చిత్ర టైటిల్ వార‌ణాసి నుండి ఎనౌన్స్ చేయ‌నున్నారు.3001
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles