సూప‌ర్ స్టార్‌తో జోడీ క‌ట్టే ఛాన్స్ అందుకున్న కీర్తి సురేష్‌

Thu,December 20, 2018 11:41 AM

సూపర్ స్టార్ రజినీకాంత్‌తో ఒక్క‌సారైన న‌టించాల‌ని స‌గ‌టు న‌టీన‌టులు అనుకోవ‌డం స‌హజం. ఒక‌వేళ అనుకోకుండా వారిని అదృష్ట దేవ‌త త‌లుపు త‌డితే వారి ఆనందానికి అవ‌ధులే ఉండ‌వు. కార్తీక్ సుబ్బ‌రాజు ద‌ర్శ‌క‌త్వంలో ర‌జనీకాంత్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కుతున్న చిత్రంలో కథానాయిక‌గా త్రిష‌కి అవ‌కాశం ద‌క్కింది. దీంతో ఆ అమ్మ‌డి ఆనందానికి అవ‌ధులు లేవు. ఇక ఇప్పుడు కీర్తి సురేష్‌.. ర‌జ‌నీకాంత్ స‌ర‌స‌న జ‌త క‌ట్టే ఛాన్స్ ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది.


ర‌జ‌నీకాంత్ తాజా చిత్రం పేటా సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కానుండ‌గా, ఈ మూవీ రిలీజ్ త‌ర్వాత మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో త‌న 166వ సినిమా చేయ‌నున్నాడు త‌లైవ‌ర్‌. ఈ చిత్రం మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందనుంది. లైకా ప్రొడక్షన్స్ నిర్మించనున్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించనున్నాడు. చిత్రంలో రజినీ కి జోడిగా కీర్తి సురేష్ ను తీసుకుంటున్నారు అనే ప్రచారం జరుగుతుంది. కీర్తి చేతిలో పెద్ద‌గా సినిమాలు లేక‌పోవ‌డంతో వ‌చ్చిన అవ‌కాశాన్ని ఆమె త‌ప్ప‌క‌ స‌ద్వినియోగం చేసుకుంటుంద‌ని అంటున్నారు.

2537
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles