కీర్తి సురేష్ చేసేది సాహ‌స‌మేనా ?

Fri,April 6, 2018 08:59 AM

ప్ర‌స్తుతం ఇటు టాలీవుడ్ అటు కోలీవుడ్‌లో స్టార్ హీరోల స‌ర‌స‌న జ‌త క‌డుతూ బిజీ హీరోయిన్‌గా ఉన్న న‌టి కీర్తి సురేష్‌. త‌క్కువ టైంలోనే ఎక్కువ‌ క్రేజ్ సంపాదించిన ఈ అమ్మ‌డు మహాన‌టి వంటి క్రేజీ ప్రాజెక్ట్‌లో సావిత్రిగా న‌టిస్తుంది. ఇక విజ‌య్ స‌ర‌స‌న ఓ చిత్రం, విక్రమ్ హీరోగా రూపొందుతున్న సామి 2 చిత్రాలతో బిజీగా ఉంది ఈ అమ్మ‌డు. అయితే అజ్ఞాత‌వాసి చిత్రంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా న‌టించిన కీర్తి త‌న పాత్ర‌కి తానే డ‌బ్బింగ్ చెప్పుకుంది. ఇప్పుడు నాగ్ అశ్విన్ తెర‌కెక్కిస్తున్న మ‌హాన‌టిలోను కీర్తి ఓన్ డ‌బ్బింగ్ చెప్పుకుంటుంది. ఇప్ప‌టికే డ‌బ్బింగ్ ప‌నులు మొద‌ల‌య్యాయి. అయితే సావిత్రి లాంటి గొప్ప న‌టి పాత్ర‌ని పోషించిడం క‌త్తి మీద సామే. మ‌రి ఆ పాత్ర‌ని ధైర్యంగా పోషించిన కీర్తి, త‌న పాత్ర‌కి తానే డ‌బ్బింగ్ చెప్పుకోవ‌డం విశేషం. కీర్తి సురేష్ ఇలా చేయ‌డం నిజంగా పెద్ద సాహ‌స‌మే అని అంటున్నారు. మ‌హాన‌టి చిత్రం మే 9న విడుద‌ల కానుండ‌గా ఇందులో స‌మంత‌, మోహ‌న్ బాబు, దుల్క‌ర్ స‌ల్మాన్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, షాలిని పాండే ముఖ్య పాత్ర‌లు పోషించారు.

4257
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles