కీర్తిసురేశ్ కొత్త సినిమా షురూ..

Thu,January 10, 2019 10:28 PM
keerthi suresh new movie started today

మహానటి సావిత్రి పాత్రలో అసమాన నటనను ప్రదర్శించి విమర్శకుల ప్రశంసలందుకుంది కీర్తిసురేష్. ఈ హీరోయిన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ఇవాళ హైదరాబాద్ లో లాంఛనంగా ప్రారంభమైంది. నరేంద్ర దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మహేష్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం కీర్తిసురేష్ పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నందమూరి కల్యాణ్ రామ్ క్లాప్ కొట్టగా..వెంకీ అట్లూరి, నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ కెమెరా స్విఛాన్ చేశారు. డైరెక్టర్ హరీష్ శంకర్ గౌరవ దర్శకత్వం వహించారు.

ఈ సందర్భంగా కీర్తిసురేష్ మాట్లాడుతూ ‘తెలుగులో ‘మహానటి’ తరువాత వస్తున్న సినిమా ఇది. మహిళా ప్రధానమైన చిత్రంలో నటించడం ఆనందంగా వుంది. ప్రతి అమ్మాయికి కనెక్ట్ అవుతుంది. అత్యధిక భాగం యుఎస్ చిత్రీకరణ జరుపుకోనుంది. డైరెక్టర్ నరేంద్ర మంచి కథ సిద్ధం చేశారు. తప్పకుండా ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరవుతాననే నమ్మకముంది’ అన్నారు.


2038
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles