రాజమౌళి సినిమాలో కీర్తిసురేశ్..?

Fri,June 29, 2018 07:35 PM

సావిత్రి బయోపిక్ ‘మహానటి’ లో నటించి ప్రేక్షకుల నుంచి నీరాజనాలు అందుకుంది కీర్తిసురేశ్. మహానటిలో అద్భుతమైన నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది కీర్తి. ఈ హీరోయిన్ విక్రమ్‌తో కలిసి సామి 2 చిత్రంలో నటిస్తోంది.

వరుస ప్రాజెక్టులతో బిజీబిజీగా ఉన్న కీర్తిసురేశ్ ఎస్‌ఎస్ రాజమౌళి సినిమాలో నటించే అవకాశం కొట్టేసినట్లు ఫిలింనగర్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రాజమౌళి రాంచరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో #ఆర్‌ఆర్‌ఆర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో లీడ్ రోల్ కోసం చిత్రయూనిట్ కీర్తిసురేశ్‌ను సంప్రదించినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో నటించే విషయమై చిత్రయూనిట్ కీర్తిసురేశ్‌తో చర్చించినట్లు తెలుస్తోంది. అయితే కీర్తి సురేశ్‌ రాజమౌళి సినిమాకు ఎంపికయ్యిందా? లేదా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.

4238
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles