సావిత్రిని కళ్ళ ముందు సాక్షాత్కరింపజేసిన 'మహానటి'

Sat,April 14, 2018 05:43 PM
keerthi suresh first look released

తెలుగు తెరపై చెరగని ముద్ర వేసుకున్న అందాల తార సావిత్రి జీవిత నేపథ్యంలో మహానటి సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. మే 9న చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తుండగా, మధుర వాణి అనే జర్నలిస్ట్ పాత్రలో సమంత, విజయ్ ఆంటోని పాత్రలో విజయ్ దేవరకొండ, జెమిని గణేషన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ , ఎస్వీఆర్ పాత్రలో మోహన్ బాబు, మరో ముఖ్య పాత్రలో షాలిని పాండే కనిపించనున్నారు. చిత్ర రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న క్రమంలో మూవీలోని పాత్రలకి సంబంధించిన లుక్స్ ఒక్కొక్కటిగా విడుదల చేస్తూ వస్తున్నారు.

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మహానటి చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన కీర్తి సురేష్ లుక్ కి సంబంధించి ఇప్పటి వరకు ఒక్క ఫోటో కూడా విడుదల కాలేదు. కొన్ని ఫోటోలు లీక్ అయినప్పటికి అవి అభిమానుల దృష్టిని అంతగా ఆకర్షించలేదు. అయితే ఈ రోజు టీజర్ విడుదల చేస్తున్న క్రమంలో సావిత్రి పాత్ర పోషిస్తున్న కీర్తి సురేష్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. పరదా వెనుక నుండి ఓర చూపు చూస్తున్న కీర్తి అలనాటి అందాల తార సావిత్రిని కళ్ళ ముందుకు సాక్షాత్కరింపజేసినట్టుగా ఉంది. అచ్చు సావిత్రిని పోలిన హెయిర్ స్టైల్, కనుబొమ్మలు, ఫుల్ జాకెట్ ధరించి చూసేవారిని ఇట్టే కట్టిపడేస్తోంది కీర్తి సురేష్. అయితే లుక్ పరంగా సావిత్రిని గుర్తుకి తెచ్చిన కీర్తి సురేష్, అసమాన్య నటనతో మహానటిగా గుర్తింపు తెచ్చుకున్న సావిత్రిలా నటించి మెప్పించగలదా లేదా అనేది సస్పెన్స్ . ఈ సినిమాలో కీర్తి తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకుంది. తమిళంలో ఈ చిత్రం ‘నడిగర్ తిలగమ్’ అనే టైటిల్ తో విడుదల కానుంది.

3726
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS