త‌ప్పుడు ప్రచారంపై కీర్తి సురేష్ ఆగ్ర‌హం..!

Tue,February 6, 2018 12:09 PM
Keerthi Suresh fire on netigens

ప్ర‌స్తుతం ఇటు టాలీవుడ్ అటు కోలీవుడ్‌లో స్టార్ హీరోల స‌ర‌స‌న జ‌త క‌డుతూ బిజీ హీరోయిన్‌గా ఉన్న న‌టి కీర్తి సురేష్‌. త‌క్కువ టైంలోనే మంచి క్రేజ్ సంపాదించిన ఈ అమ్మ‌డు మహాన‌టి వంటి క్రేజీ ప్రాజెక్ట్‌లో సావిత్రిగా న‌టిస్తుంది. ఇక విజ‌య్ స‌ర‌స‌న ఓ చిత్రం, విక్రమ్ హీరోగా రూపొందుతున్న సామి 2 చిత్రాలతో బిజీగా ఉంది ఈ అమ్మ‌డు. హరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సామి 2 చిత్రంలో ముందుగా త్రిష‌ని క‌థానాయిక‌గా ఎంచుకున్నారు. కొద్ది రోజులు షూటింగ్ లో పాల్గొన్న ఈ అమ్మడు ఇతర కారణాల వలన సినిమా నుండి తప్పుకుంది. ఈ నేపథ్యంలో కథానాయికగా కీర్తి సురేష్‌ని సెలక్ట్ చేశారు. అయితే కీర్తి సురేష్ క‌థానాయిక‌గా ఎంపికైందో లేదో త్రిష తప్పుకోవ‌డానికి కార‌ణం కీర్తి సురేష్‌ అని ప్ర‌చారం మొద‌లు పెట్టారు కోలీవుడ్ జనాలు. ఈ ప్రచారంపై కీర్తి మండిపడుతోంది. తనకు సంబంధం లేని వ్యవహారానికి తను కారణం అని అంతా అనుకొంటూ ఉండటం పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. త్రిష తప్పుకోవడానికి తను ఏ రకంగా కారణం అవుతాను? అని ప్రశ్నిస్తోంది. 2003లో వచ్చిన సామి చిత్రానికి సీక్వెల్‌గా సామి 2 తెర‌కెక్కుతుండ‌గా శిబు థ‌మీన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

2723
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles