అదిరిన కేదార్‌నాథ్ ట్రైల‌ర్

Mon,November 12, 2018 05:32 PM
Kedarnath official trailer released, Sara looks beautiful

ముంబై: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌, సారా అలీ ఖాన్ న‌టిస్తున్న కేదార్‌నాథ్ ఫిల్మ్‌.. అఫిషియ‌ల్ ట్రైల‌ర్‌ను ఇవాళ రిలీజ్ చేశారు. 2.59 సెక‌న్లు ఉన్న ఆ ట్రైల‌ర్‌.. ఉత్త‌రాఖండ్‌లోని హిమాల‌య అందాల‌ను అద్భుతంగా ఆవిష్క‌రించింది. రాక్ ఆన్‌, కై పో చి సినిమాల‌ను డైర‌క్ట్ చేసిన అభిషేక్ క‌పూర్.. ఈ సినిమానూ డైర‌క్ట్ చేశాడు. తొలి సినిమా చేస్తున్న సారా అలీ ఖాన్ .. ఈ సినిమాలో ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తోంది. 2013లో కేదార్‌నాథ్‌లో వ‌చ్చిన వ‌ర‌ద‌ల నేప‌థ్యాన్ని కూడా ఈ సినిమా క‌థ‌కు జోడించారు. ప్రేమ ఓ యాత్ర అన్న ట్యాగ్‌లైన్‌ను కూడా సినిమాకు ఫిక్స్ చేశారు. భీక‌ర‌మైన వ‌ద‌ర‌ల మ‌ధ్య ఓ జంట‌లో చిగురించిన ప్రేమ‌ను డైర‌క్ట‌ర్ అత్య‌ద్భుతంగా తెర‌కెక్కించిన‌ట్లు ట్రైల‌ర్‌తో తెలిసిపోతున్న‌ది. డిసెంబ‌ర్ 7వ తేదీన కేదార్‌నాథ్‌ను రిలీజ్ చేస్తున్నారు.

1459
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles