దిలీప్ కేసులో ప‌ల్స‌ర్ సునీ చెప్పిన మేడం ఈమెనే

Wed,August 30, 2017 05:44 PM

మలయాళ నటి అపహరణ, లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన దిలీప్ కేసు లో రోజుకు రోజుకు కొత్త విష‌యాలు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. ఈ కేసులో ప్ర‌ధాన నిందుతుడైన ప‌ల్స‌ర్ సునీ అప్ప‌ట్లో ఓ మేడంకి ఈ కేసుతో సంబంధం ఉంద‌ని, ఆమె ఆదేశాల మేర‌కే అప‌హ‌రించి లైంగికంగా వేధించామ‌ని అన్నాడు. ఆ న‌టిని బ్లాక్ మెయిల్ చేసేందుకే ఫోటోలు , వీడియోలు తీసిన‌ట్టు ఒప్పుకున్నాడు. ఇక ఈ దుర్మార్గ‌పు ప‌నికి పాల్పడేందుకు డ‌బ్బుని స‌మకూర్చింది ఆ మేడ‌మే అని సునీ అన్నాడు. అయితే ఆమె కేవ‌లం మ‌నీ అరేంజ్ చేసిందే త‌ప్ప నేరంలో పాల్గొన‌లేద‌ని గ‌తంలో వివ‌రించాడు. ఇప్పుడు ఇదే కేసు విష‌యంలో మ‌రి కొన్ని విష‌యాలు వెల్లడించాడు ప‌ల్స‌ర్ సున్నీ. ఆ మేడం ఎవ‌రో కాదు కావ్య మాధ‌వ‌న్ అన్న ప‌ల్సర్, అప‌హ‌ర‌ణ‌, లైంగిక వేధింపుల కేసులో ఆమె హ‌స్తం ఉందా లేదా అనే దానిపై లేదు అనే స‌మాధానం చెప్పాడు.


మలయాళ సినీ నటుడు దిలీప్.. మొదటి సారి నటి మంజూ వారియర్ ని 1998లో వివాహం చేసుకున్నాడు. వీరికి మీనాక్షి అనే కూతురు కూడా ఉంది. కొన్నాళ్ళు సాఫీగా సాగిన వీరి వివాహ బంధంలో అనుకోని విభేదాలు తలెత్తడంతో 2015 జనవరిలో దీలీప్- మంజూలు చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 2016 నవంబరులో నటి కావ్యను దిలీప్ వివాహమాడారు. అప్పటి నుండి మంజూ- దిలీప్ విడిపోవడానికి కారణం కావ్య అంటూ పుకార్లు షికారు చేశాయి. అయితే కావ్య మాధవన్ తో దిలీప్ రహస్య ప్రేమాయణం నడుపుతున్న విషయాన్ని మంజూ వారియర్ కి బాధిత నటి చెప్పడం కారణంగానే ఆమెపై దిలీప్ కక్ష కట్టాడని వార్త‌లు వచ్చిన సంగ‌తి తెలిసిందే.

దిలీప్ పర్సనల్ విషయాన్ని లీక్ చేసిన కారణంగా ఆ నటిని ఘోరంగా అవమానించాలని భావించిన దిలీప్ 2013 లోనే కుట్ర పన్నినట్టు పోలీస్ ఇటీవ‌ల ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు. ఈ కుట్రకి బీజం ఎర్నాకుళంలోని ఓ హోటల్ లో పడ్డట్టు పోలీసులు చెప్పారు. పల్సర్ సునీతో కలిసి దిలీప్ స్కెచ్ వేయగా, ఆమెపై అఘాయిత్యం చేసి వాటికి సంబంధించిన వీడియోలను, నగ్నంగా ఉన్న ఫోటోలను తీస్తే ఇందుకు గాను 1.5 కోట్ల రూపాయలని సునీకి ముట్టచెబుతానని దిలీప్ హామీ ఇచ్చాడట. మరి ఇంతకు సునీ అతడి సహచరుడు విఘ్నేష్ తో కలిసి ఫోటోలు వీడియోలు తీసాడా, అవి దిలీప్ ప్రస్తుత భార్య కావ్య మాధవన్ కి ఇచ్చాడా.. ఇలా ఎన్నో అనుమానాలు ఈ కేసులో ఉండగా, వీటిపై క్లారిటీ రావలసి ఉంది.

1871
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles