యూ ట‌ర్న్ టీంపై ప్ర‌శంస‌లు కురిపించిన క‌విత‌

Tue,September 18, 2018 01:10 PM
kavitha praise u tun team

అక్కినేని స‌మంత న‌టించిన తాజా చిత్రం యూట‌ర్న్‌. క‌న్న‌డ రీమేక్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రం పవన్ కుమార్ దర్శకత్వంలో రూపొందింది. సెప్టెంబ‌ర్ 13న ఈ సస్పెన్స్ థ్రిల్ల‌ర్ విడుద‌ల అయింది . ఈ చిత్రంలో స‌మంత‌తో పాటు భూమిక , అది పినిశెట్టి , రాహుల్ రవీంద్రన్ ముఖ్య పాత్రల్లో నటించారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకం ఫై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్న ఈచిత్రానికి పూర్ణ చంద్ర తేజస్వి సంగీతం అందించారు. తెలుగు, తమిళ భాషలలో విడుదల అయిన ఈ చిత్రానికి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ల‌భించాయి.

యూ ట‌ర్న్ సినిమాలో రచన అనే జర్నలిస్టు పాత్రలో నటించిన సమంత, తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు. దర్శకుడు పవన్ ఈ సినిమాలో చెప్పాలనుకున్న మెసేజ్‌ని అంద‌రికి అర్ధ‌మయ్యేలా చూపించాడు. స్క్రీన్‌ప్లే, బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌,న‌టీన‌టుల ప‌ర్‌ఫార్మెన్స్ సినిమాని ఓ రేంజ్‌కి తీసుకెళ్లింది. ఈ క్ర‌మంలో స‌క్సెస్ మీట్‌ని నిర్వ‌హించారు నిర్మాత‌లు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవితగారు హాజరయ్యారు. చిత్రంపై ప్రశంస‌ల వ‌ర్షం కురిపించారు.

తాను ఇంకా సినిమాని చూడ‌లేద‌ని చెప్పిన క‌విత త‌న ఇద్ద‌రు పిల్ల‌ల ద్వారా రివ్యూ తెలుసుకున్నాన‌ని అన్నారు. రంగ‌స్థ‌లంలో ప‌ల్లెటూరి అమ్మాయిగా క‌నిపించిన స‌మంత యూట‌ర్న్ చిత్రంలో జ‌ర్నలిస్ట్‌గా చ‌క్క‌ని న‌ట ప్ర‌ద‌ర్శ‌న చేశార‌ని అన్నారు. ఇక ద‌ర్శ‌కుడు థ్రిల్లింగ్ అంశాల‌తో ప్రేక్ష‌కుల‌ని సినిమా థియేట‌ర్స్‌కి రప్పించార‌ని క‌విత పేర్కొన్నారు. సినిమాలో భాగం అయిన మిగ‌తా స‌భ్యుల‌ని కూడా క‌విత ప్ర‌శంసించారు. థ్రిల్ల‌ర్ మూవీతో సోష‌ల్ మెసేజ్‌ని జ‌నాల‌లోకి చేర‌వేయడం గొప్ప అంశం అంటూ క‌విత.. టీంపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు.

1929
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles