కాజల్ రిస్క్ చేస్తుందా ?

Thu,March 30, 2017 11:00 AM
kavalai vendam released tommorow

గత ఏడాది సరైన సక్సెస్ లు లేక ఇబ్బందిపడ్డ కాజల్ ఈ ఏడాది విడుదలైన ఖైదీ నెం 150 చిత్రంతో మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు అజిత్ మూవీ వివేగంతో పాటు నేనే రాజు నేనే మంత్రి చేస్తుంది. కాజల్ నటించిన మరి కొన్ని ప్రాజెక్ట్స్ కూడా త్వరలో పట్టాలెక్కనున్నాయని తెలుస్తుంది. అయితే ఎప్పటి నుండో విడుదల కాక వాయిదాపడ్డ కాజల్ చిత్రం మార్చి 31న తెలుగులో విడుదల కానుందని అంటున్నారు. కావలై వేండమే అనే చిత్రంలో జీవా సరసన నటించిన కాజల్ ఈ చిత్రాన్ని రేపు తెలుగు ప్రేక్షకుల ముందుకు ఎంత వరకు ఈ ప్రేమతో తీసుకురానుంది. మార్చి 31న గురు, రోగ్,డోర వంటి చిత్రాలు విడుదలకు సిద్ధం కాగా, ఈ పోటీలో కాజల్ తన సినిమాను విడుదల చేయడం గ్రేట్ అంటున్నారు. మరి ఈ బిగ్ ఫైట్ లో కాజల్ మూవీ విజయం సాధిస్తుందా లేదా తెలుసుకోవాలంటే మరి కొన్ని గంటలు ఆగాల్సిందే.

1530
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles