రొమాంటిక్ కామెడీ మూవీ సెకండ్ టీజర్

Thu,November 17, 2016 11:49 AM
Kavalai Vendam - Official Tamil Teaser 2

2011 లో వచ్చిన రంగం చిత్రంతో తెలుగులో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు స్టార్ హీరో జీవా. ఆ తర్వాత తెలుగులో వచ్చిన స్నేహితుడు, మాస్క్, చిరునవ్వుల చిరుజల్లు చిత్రాలు ఈ హీరోకు తెలుగులో మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఇప్పుడు మరోసారి ఇదే క్రేజ్ తో రొమాంటిక్ కామెడి ఎంటర్ టైనర్ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. డీకే దర్శకత్వంలో కవలై వేండాం పేరుతో తెరకెక్కిన చిత్రం తెలుగులో ‘ఎంత వరకు ఈ ప్రేమ’ అనే పేరుతో విడుదల కానుంది. లియోన్ జేమ్స్ ఈ చిత్రానికి సంగీతం అందించగా, కథానాయికగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. నవంబర్ 24న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంలో విడుదల చేయబోతున్నారు. బాబీ సింహా, శృతి రామకృష్ణన్, సునయన, మంత్ర తదితరులు ఈ చిత్రంలో ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా కవలై వేండాం చిత్రానికి సంబంధించి మరో టీజర్ విడుదలైంది. ఆ టీజర్ పై మీరు ఓ లుక్కేయండి.

2079
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles