భయపెట్టే వాడికి...భయపడే వాడికి మధ్య కవచంలా ఒక్కడుంటాడురా..

Tue,November 13, 2018 08:19 AM
kavacham teaser gets high emotional

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజ‌ల్ అగ‌ర్వాల్, మెహ‌రీన్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ద‌ర్శ‌కుడు శ్రీనివాస్ మామిళ్ళ తెర‌కెక్కిస్తున్న చిత్రం ‘క‌వ‌చం’. ఈ సినిమాలో శ్రీనివాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారు. తాజాగా చిత్ర టీజ‌ర్ విడుద‌ల కాగా ఇందులో శ్రీనివాస్ పోలీస్ ఆఫీస‌ర్‌గా అద‌ర‌గొట్టాడు. టీజ‌ర్‌లో ఎక్కువ భాగం యాక్ష‌న్ సీన్స్ ఉండ‌గా, డైలాగులు కూడా అదే రేంజ్‌లో ఉన్నాయి. ‘భయపెట్టే వాడికి, భయపడే వాడికి మధ్య కవచంలా ఒక్కడుంటాడురా. వాడే పోలీస్’ అంటూ బెల్లంకొండ శ్రీనివాస్ చెప్పే డైలాగ్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ‘అనగనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యానికి రాజు లేడు. రాణి మాత్రమే. ఆ రాణికి కవచంలా ఒక సైనికుడు’ అంటూ వచ్చే వాయిస్ ఓవర్‌ను బట్టి చూస్తుంటే ఈ సినిమా కూడా హీరోయిన్‌కి అండగా నిలిచే హీరో కథతోనే తెరకెక్కినట్లు అర్థమవుతోంది. చిత్రంలో హ‌ర్షవ‌ర్ధన్ రాణే, బాలీవుడ్ న‌టుడు నీల్ నితిన్ ముఖేష్ కీల‌క‌పాత్రల్లో న‌టించారు. పోసాని కృష్ణముర‌ళి, స‌త్యం రాజేష్, అపూర్వ ఇతర పాత్రల్లో నటించారు. ఇప్పటికే ‘క‌వ‌చం’ షూటింగ్ పూర్తి కాగా, పాట‌ల చిత్రీక‌ర‌ణ మాత్రమే మిగిలి ఉంది. ఎస్.ఎస్.థ‌మ‌న్ సంగీతం సమకూరుస్తోన్న ఈ చిత్రానికి ఛోటా కే నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. వంశ‌ధార క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై న‌వీన్ సొంటినేని(నాని) నిర్మిస్తున్నారు. డిసెంబ‌ర్‌లో ఈ చిత్రం విడుద‌ల కానుంది.

2186
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles