నామినేష‌న్ కోసం గుడ్లు ప‌గ‌ల‌గొట్టుకున్న ఇంటి స‌భ్యులు

Tue,July 24, 2018 08:51 AM
kaushal target for house mates

బిగ్ బాస్ సీజ‌న్ 2 ప్ర‌స్తుతం 11 మంది కంటెస్టెంట్స్‌తో రంజుగా సాగుతుంది. హౌజ్ నుండి ఇప్ప‌టి వ‌ర‌కు సంజ‌న‌, నూత‌న్ నాయుడు, కిరీటీ, శ్యామ‌ల‌, భాను శ్రీ, తేజ‌స్వినీలు ఎలిమినేట్ కాగా నేడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఒక‌రు ఇంటిలోకి ఎంట్రీ ఇవ్వ‌నున్నార‌ని తెలుస్తుంది. ఇక ఎప్ప‌టిలానే సోమ‌వారం (ఎపిసోడ్ 44) నాడు ఎలిమినేష‌న్ కోసం ఓ టాస్క్ జ‌రిగింది. ఈ టాస్క్‌లో ఎవ‌రినైతే నామినేట్ చేయాల‌నుకుంటున్నారో వారి త‌ల‌పై గుడ్లు ప‌గ‌ల‌గొట్టాల్సి ఉంటుంది. కౌశ‌ల్‌పై ఎక్కువ కోడి గుడ్లు ప‌గ‌ల‌డంతో ఆయ‌న కాస్త ఫీల‌య్యారు. ఆ త‌ర్వాత త‌న‌ గురించి ఇత‌రుల‌తో ప‌దే ప‌దే చ‌ర్చ‌లు జ‌రుపుతున్న నందినిపై విరుచుకుప‌డ్డాడు కౌశ‌ల్‌. ఫ్రెండ్‌షిప్ వాల్యూ తీసేసావంటూ ఒకింత ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. ఎన్నో డిస్క‌ష‌న్స్ న‌డుమ సోమ‌వారం నాటి ఎపిసోడ్ హాట్ హాట్‌గా జ‌రిగింది.

44వ ఎపిసోడ్‌లో కౌశ‌ల్ నీ స‌ల‌హాలు నాకు అవ‌స‌రం లేద‌న్న నందినికి క్లాస్ పీకాడు కౌశ‌ల్‌. నీకు నా వ‌ల‌న స‌మ‌స్య ఉంటే మాట్లాడ‌కు. అంతేకాని అంద‌రి ముందు నా గురించి చర్చ‌లు జ‌ర‌ప‌కు. హౌజ్‌లోకి వ‌చ్చిన‌ప్పుడు నా స‌ల‌హాలు కావాల‌ని అడిగావు. ఇప్పుడేమో నీకు ఇష్టం లేకుండా బ‌ల‌వంతంగా స‌ల‌హాలు ఇస్తున్న‌ట్టు మాట్లాడుతున్నావు. నా వ‌ల‌న నీకు ఏమైన స‌మ‌స్య ఉంటే కూర్చొని ప‌రిష్క‌రించుకుందాం అంతే త‌ప్ప కెప్టెన్‌కి ఫిర్యాదు చేయ‌డం, నేను అడిగిన‌ప్పుడు మాత్ర‌మే స‌ల‌హాలు ఇవ్వాల‌ని చెప్ప‌డం ఎంత వ‌ర‌కు క‌రెక్ట్‌. నీకు కావాల్సి వ‌చ్చిన‌ప్ప‌డు స‌ల‌హాలు ఇవ్వ‌మ‌న‌డం, వ‌ద్ద‌న్న‌ప్పుడు కామ్‌గా ఉండ‌డానికి నేను యంత్రాన్ని కాదు అంటూ గట్టిగానే నందినికి లెఫ్ట్ అండ్ రైట్ తీసుకున్నాడు. ఆ త‌ర్వాత త‌న త‌ప్పు తెలుసుకున్న నందిని .. కౌశ‌ల్‌కి క్ష‌మాప‌ణ‌లు చెప్పింది.

ఈ వారం ఎలిమినేష‌న్‌లో భాగంగా ఇంట్లో న‌చ్చ‌ని ఇద్ద‌రు వ్య‌క్తులు త‌ల‌పైన గుడ్డు ప‌గ‌ల‌గొట్టాల్సి ఉంటుందని బిగ్ బాస్ చెప్ప‌డంతో టాస్క్ హోరా హోరీగా సాగింది. ముందుగా సామ్రాట్.. కౌశల్, సునైనా తలపై గుడ్డు పగలగొట్ట‌గా ,
సునైనా.. అమిత్, రోల్ రైడా తలపై గుడ్డు పగలగొట్టింది. గణేష్.. నందిని, కౌశల్ తలపై గుడ్డు పగలగొట్టాడు. తనీష్.. కౌశల్, అమిత్ తలపై గుడ్డు పగలగొట్టాడు. గీతా మధురి.. బాబు గోగినేని, గణేష్ తలపై గుడ్డు పగలగొట్టింది. రోల్ రైడా.. సునైనా, కౌశల్ తలపై గుడ్డు పగలగొట్టాడు. బాబు గోగినేని.. అమిత్, కౌశల్ తలపై గుడ్డు పగలగొట్టాడు. అమిత్.. కౌశల్, బాబు గోగినేని తలపై గుడ్డు పగలగొట్టాడు. నందిని.. కౌశల్, గణేష్ తలపై గుడ్డు పగలగొట్టింది. దీప్తి నల్లమోతు... బాబు గోగినేని, గణేష్ తలపై గుడ్డు పగలగొట్టింది. కౌశల్... బాబు గోగినేని, నందిని తలపై గుడ్డు పగలగొట్టాడు.

ఇంటి స‌భ్యులు ఎక్కువ మంది ఇంట్లో స్ట్రాంగ్‌గా ఉన్న కౌశ‌ల్‌పై మూకుమ్మ‌డి దాడి చేయ‌డం విశేషం. ఇక టాస్క్‌లో భాగంగా ఈ వారం ఎలిమినేష‌న్ కోసం కౌశల్‌,బాబు గోగినేని, గణేష్, అమిత్, దీప్తి సునైనా, నందినిలు ఎంపిక‌య్యారు. అయితే త‌ల‌పై ఏడుగురు స‌భ్యులు కోడి గుడ్డు ప‌గ‌ల‌గొట్ట‌డంపై ఎమోష‌న‌ల్ అయిన కౌశ‌ల్ ఎందుకు అలా జ‌రిగిందో వివ‌రించారు. కౌశ‌ల్‌తో పెట్టుకుంటే ఎవ‌రైన ఎలిమినేట్ అవుతార‌నే విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ నేను మీర‌న్న మాట‌ల‌కి అలా అన్నానే త‌ప్ప మ‌న‌సులో ఏమి లేద‌ని చెప్పాడు. అయితే టాస్క్‌లో భాగంగా న‌చ్చ‌ని ఇద్ద‌రు వ్య‌క్తుల‌పై గుడ్లు ప‌గ‌ల‌గొట్టే ముందు త‌మ‌కు వారెందుకు న‌చ్చ‌లేదో వివ‌ర‌ణ ఇచ్చారు ఇంటి స‌భ్యులు.

కౌశ‌ల్ గుడ్డు ప‌గ‌ల గొట్టే ముందు తెలుగు సినిమా పరిశ్ర‌మ‌కి దేవుళ్ల వంటి వారైన రాజ‌మౌళి, కీర‌వాణీల‌పై విమ‌ర్శ‌లు చేస్తే ఊరుకునేదే లేదని అన్నాడు . ఈ సంద‌ర్భంలో బాబు గోగినేని కౌశ‌ల్ మాట‌లు తిప్పి కొడుతూ ఆయ‌న వారి గురించి పాజిటివ్‌గా మాట్లాడ‌డం వెనుక ఓ కార‌ణం ఉంది. రాజ‌మౌళి, కీర‌వాణి అభిమానుల మ‌ద్ద‌తు కోస‌మే అత‌డు ఇలాంటి కామెంట్స్ చేశాడు. ఒకవేళ నేను రాజమౌళిని కామెంట్ చేస్తే.. రాజమౌళి సమాధానం చెప్తారు. ఇలాంటి కిరాయి స్పోక్ పర్శన్ అవసరం లేదంటూ బాబు కౌంటర్ ఇచ్చారు. కొద్ది సేప‌టి త‌ర్వాత సినిమాకి పనిచేసిన తనీష్‌కి ఎక్కువ మొత్తం ఇవ్వ‌డంపై కౌశ‌ల్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. దీనిపై అమిత్ పొర‌పాటు వ‌ల‌న ఇలా జరిగింద‌ని చెప్పిన కూడా అత‌ను రాజీప‌డ‌లేదు. ఇక ఇంటి స‌భ్యులకి స్క్రీన్‌పై ఓ వీడియో చూపించారు బిగ్ బాస్‌. ఈ వీడియోని బ‌ట్టి సున‌య‌న‌కి చాలా నిద్ర అవ‌స‌ర‌మ‌ని తెలుస్తుంద‌ని బిగ్ బాస్ అన్నారు.

నున‌య‌న ప్ర‌శాంతంగా ప‌డుకోవ‌డానికి బిగ్ బాస్‌.. ఓ మంచాన్ని పంపిస్తున్న‌ట్టు తెలిపారు. సున‌య‌న బాగోగుల‌న్ని గ‌ణేష్ చూసుకోవ‌ల‌సి ఉంటుంద‌ని బిగ్ బాస్ అన్నారు. సున‌య‌న ఎక్క‌డికి వెళ్లాల‌న్న గ‌ణేష్ ద‌గ్గ‌ర ఉండి చూసుకోవ‌ల‌సి ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. ఈ క్ర‌మంలో సున‌య‌న‌కి సంబంధించిన బాగోగుల‌న్నీ గ‌ణేష్ చూసుకుంటున్నాడు. ఆయ‌న‌కి ఇంటి స‌భ్యులు స‌ల‌హాలు ఇస్తూ వ‌చ్చారు. దీంతో 44వ ఎపిసోడ్ పూర్తైంది. మ‌రి నేటి ఎపిసోడ్‌లో ఎవ‌రు ఎంట్రీ ఇవ్వ‌బోతున్నారు. వారు హౌజ్‌లో ఎలా సంద‌డి చేస్తారో తెలియాలింటే కాస్త ఓపిక‌ ప‌ట్టాల్సిందే మ‌రి.

4044
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS