బిగ్ బాస్ 2 విజేత ఎవరంటే ?

Sun,September 30, 2018 11:27 AM
kaushal gets bigg boss2 title

బుల్లితెర‌పై సెన్సేష‌న్ క్రియేట్ చేస్తున్న అతి పెద్ద‌ రియాలిటీ షో బిగ్ బాస్. హిందీలో మొద‌లైన ఈ రియాలిటీ షో ప్ర‌స్తుతం సౌత్ లోని అన్ని భాష‌ల‌కి పాకింది. తెలుగులో ఎన్టీఆర్ హోస్ట్‌గా మొద‌లైన ఈ కార్య‌క్ర‌మం జూన్ 10న మ‌రో సీజ‌న్‌లోకి అడుగుపెట్టింది. నేచుర‌ల్ స్టార్ నాని హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించిన సీజ‌న్ 2లో మొత్తం 18 మంది కంటెస్టెంట్‌లు పాల్గొన్నారు. 112 రోజుల పాటు విజ‌య‌వంతంగా త‌మ జ‌ర్నీని కొన‌సాగించిన ఐదుగురు స‌భ్యులు మాత్ర‌మే చివ‌రికి ఫైన‌లిస్ట్‌ల‌లో మిగిలారు. ఈ ఐదుగురిలో విజేత ఎవ‌ర‌నేదానిపై రెండు తెలుగు రాష్ట్రాల‌లో జోరుగా చ‌ర్చ జ‌రుగుతుంది.

బిగ్ బాస్ హౌజ్‌లో మొద‌టి నుండి ఎంతో డెడికేష‌న్‌తో ఉన్న వ్య‌క్తి కౌశ‌ల్‌. త‌న‌పై ఎవ‌రు దూష‌ణ‌కి దిగిన‌, ఆయ‌న‌ని దూరం పెట్టిన కూడా ఎంతో నిబ‌ద్ధ‌త‌తో ఉంటూ త‌న‌కంటూ ప్ర‌త్యేక అభిమానాన్ని సంపాదించుకున్నాడు కౌశ‌ల్‌. ఇప్పుడు ఆ అభిమానం కౌశ‌ల్ ఆర్మీగా మారింది. బిగ్ బాస్ సీజ‌న్ 2 కార్య‌క్ర‌మంలో సీజ‌న్ మొత్తానికి నామినేష‌న్ చేసే ప‌వ‌ర్ గీతా మాధురికి బిగ్ బాస్ ఇవ్వ‌గా, ఆమె ఆ అస్త్రాన్ని కౌశ‌ల్‌పై విసిరింది. అయిన్ప‌ప్పటికి ఓట‌మెరుగ‌ని విక్ర‌మార్కుడిలా ఫినాలేకి చేరుకున్నాడు కౌశ‌ల్‌. కొద్ది రోజులుగా కౌశ‌ల్ ఆర్మీ ఆయ‌న‌ని గెలిపించేందుకు నిద్ర లేని రాత్రులు గడ‌పింది. ఓ స్టార్ హీరోపై ఎంత‌టి ప్రేమ చూపిస్తారో అదే రేంజ్‌లో కౌశ‌ల్‌పై త‌మ అభిమానం చాటారు ఫ్యాన్స్.

ఫ్లెక్సీలు, బ్యాన‌ర్‌లు, క‌టౌట్స్‌, ఆయ‌న పేరు మీద అన్న‌దానాలు, స్కూల్స్‌లో పుస్తకాల పంపిణీ ఇలా ఒక‌టేంటి అన్ని ర‌కాలుగా కౌశ‌ల్‌పై త‌మ‌కున్న ప్రేమని చూపించారు ఆయ‌న అభిమానులు. మొద‌టి నుండే కౌశ‌ల్ విజేత‌గా నిలుస్తాడ‌ని అభిమానులు భావించ‌గా అదే నిజ‌మైంద‌ని అంటున్నారు. అందుకు కార‌ణం ఈ రోజు సాయంత్రం ప్ర‌సారం కానున్న ఎపిసోడ్ ముందే రికార్డింగ్ జ‌రుపుకుంటుంది కాబ‌ట్టి ఆ విజేత ఎవ‌రో షోలో పాల్గొన్న వారికి తెలిసిపోతుంది. సోష‌ల్ మీడియాలో వారు తెలిపిన స‌మాచారం బ‌ట్టి బిగ్ బాస్ సీజ‌న్ 2 విజేత కౌశ‌ల్ అని స‌మాచారం. న‌టి మాధ‌వీల‌త త‌న ఫేస్ బుక్ పేజ్‌లో కౌశ‌ల్ బిగ్ బాస్ విజేత‌..ఎలా అని నన్ను అడ‌గొద్దంటూ కామెంట్ పెట్టింది. మొద‌టి నుండి ఈమె కౌశ‌ల్‌కి మ‌ద్దతుగా నిలుస్తూ వ‌చ్చింది.

నెటిజ‌న్స్ కొంద‌రు బిగ్ బాస్ 2 విజేత కౌశ‌ల్ అంటూ జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఆయ‌న టైటిల్ అందుకున్న ఫోటోని షేర్ చేస్తున్నారు. కౌశ‌ల్ ఆర్మీ చూపించిన ప్రేమ వ‌ల‌న ఈ సీజ‌న్ టైటిల్ ఆయ‌న‌కే ద‌క్కింద‌ని అంటున్నారు. గీతా మాధురి ర‌న్న‌ర‌ప్‌గా నిలిచింద‌ని టాక్‌. ఫైన‌ల్ ఎపిసోడ్‌కి విక్ట‌రీ వెంక‌టేష్ చీఫ్ గెస్ట్‌గా హాజ‌రు కాగా ఆయ‌న చేతుల మీదుగా బిగ్ బాస్ టైటిల్‌ని కౌశ‌ల్ అందుకున్నాడ‌ని స‌మాచారం. మ‌రి ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వ‌చ్చే ఈ వార్త‌ల‌లో ఎంత నిజం ఉందో తెలియాలంటే సాయంత్రం ఆరుగంట‌ల వ‌ర‌కు ఆగాల్సిందే.
9251
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles