బిగ్ బాస్ విన్న‌ర్‌ డైరెక్ష‌న్‌లో హెబ్బా ప‌టేల్‌..

Sat,August 17, 2019 08:40 AM

అలా ఎలా చిత్రం తో తెలుగు తెర‌కి ఎంట్రీ ఇచ్చిన బోల్డ్ బ్యూటీ హెబ్బాకి ఈ చిత్రం తో అంతగా గుర్తింపు రాలేదు. కాని ఆ తర్వాత చేసిన 'కుమారి 21ఎఫ్' చిత్రం తన ఫేట్ నే మార్చేసింది. వ‌రుస సినిమా ఆఫ‌ర్స్ వ‌చ్చాయి. ఈడో రకం ఆడో రకం , ఏంజేల్ అనే ప‌లు చిత్రాలలో న‌టించింది. ఏ చిత్రం కూడా త‌న‌కి మంచి విజ‌యాన్ని అందించ‌లేదు. ఈ క్ర‌మంలో బిగ్ బాస్ హౌజ్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి త‌న స‌త్తాని నిరూపించుకోవాల‌ని హెబ్బా భావిస్తున్న‌ట్టుగా తెలుస్తుంది. క‌ట్ చేస్తే ఈ అమ్మ‌డు బిగ్ బాస్ విన్న‌ర్ కౌశ‌ల్ డైరెక్ష‌న్‌లో న‌టించింది.


న‌టుడిగాను, యాడ్ ఫిలిం మేక‌ర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న కౌశ‌ల్ శ్రీరామ్ గోల్డ్ లోన్ యాడ్‌ని త‌న ఏజెన్సీలో రూపొందిస్తున్నాడు. ఈ యాడ్ కోసం హెబ్బా ప‌టేల్‌పై కొన్ని సీన్స్ షూట్ చేశాడు. ఆమెతో సెల్ఫీ దిగిన ఫోటోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన కౌశ‌ల్‌.. ‘‘టైటిల్స్ వస్తుంటాయి, పోతుంటాయి. కానీ, నా బహుముఖ ప్రతిభ ఎప్ప‌టికి ఒకేలా ఉంటుంది . శ్రీరామ్ గోల్డ్ లోన్ యాడ్ ఫిల్మ్ కోసం హెబ్బా పటేల్‌ను డైరెక్ట్ చేస్తున్నాను’’ అని కౌశల్ పేర్కొన్నారు. త్వరలోనే ఈ వాణిజ్య ప్రకటన టీవీలు, థియేటర్లలో దర్శనమివ్వనుంది.

2644
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles