2కే రన్ నిర్వ‌హించిన కౌశ‌ల్ ఆర్మీ.. షాక్‌లో బిగ్ బాస్ టీం

Sun,September 9, 2018 10:52 AM
kaushal army 2 k run

అభిమానం సంపాదించ‌డం ఆషామాషి విష‌యం కాదు. అందుకోసం గొప్ప గొప్ప త్యాగాలు చేయాలి . కాని ఎలాంటి త్యాగం చేయ‌కుండా కేవ‌లం త‌న ప్ర‌వ‌ర్త‌న‌తో ఎన్నో వేల మంది అభిమానుల‌ని సంపాదించుకున్న బిగ్ బాస్ కంటెస్టెంట్ కౌశ‌ల్‌. బిగ్ బాస్ ఇంట్లోకి రాక ముందు ఆయ‌న కొంద‌రికి మాత్ర‌మే సుప‌రిచితం. కాని ఇప్పుడు ఆయ‌న పేరుతో అభిమాన సంఘాలు ఏర్ప‌డ్డాయి. కౌశ‌ల్ ఆర్మీ పేరుతో ఏర్ప‌డిన అభిమాన సంఘం బిగ్ బాస్ గేమ్‌లో ఆయ‌న‌కి ఫుల్ స‌పోర్టింగ్‌గా ఉంటుంది. ముఖ్యంగా ఎలిమినేష‌న్ స‌మ‌యంలో భారీగా ఓట్లు వేస్తూ కౌశ‌ల్‌ని సేఫ్ జోన్‌లో ప‌డేస్తున్నారు.

బిగ్ బాస్ ఇంట్లో కౌశల్ సోలో గేమ్ ఆడ‌తాడనే సంగ‌తి తెలిసిందే. అత‌నికి ప్రేమ‌, ఆప్యాయ‌త‌లు అనేవి ఉండ‌వు. గేమ్ కోసం ఇంట్లోకి వ‌చ్చాం కాబ‌ట్టి గేమే ఆడాలి అనే రూల్ పెట్టుకున్న కౌశ‌ల్ అందుకు త‌గ్గ‌ట్టే ఆడ‌తాడు. ఎవ‌రు ఫీలైన‌, త‌న‌ని దూరం పెట్టిన స‌రే ప్ర‌తి విష‌యంలో నిక్క‌చ్చిగా మాట్లాడుతాడు. చెప్పాల‌నుకున్న‌ది మొహమాటం లేకుండా చెప్పేస్తాడు. అందుకేనేమో కౌశ‌ల్‌కి ప్ర‌జ‌ల నుండి ఇంత ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. కేవ‌లం మ‌న తెలుగు రాష్ట్రాల‌లోనే కాదు విదేశాల‌లోను కౌశ‌ల్‌కి విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది.

న‌గ‌రంలో నేడు(ఆద‌వారం) కౌశ‌ళ్ ఆర్మీ .. 2 కే ర‌న్ నిర్వ‌హించింది. దీని కోసం కౌశ‌ల్ ఆర్మీ నిన్న‌ సోష‌ల్ మీడియా ద్వారా పిలుపునిచ్చింది. 2 కే ర‌న్‌లో భాగంగా అమ్మాయిలు, అబ్బాయిలే కాదు పిల్ల త‌ల్లులు కూడా మాదాపూర్‌లో జ‌రిగిన భారీ ర్యాలీలో పాల్గొన్నారు. కౌశ‌ల్ ఆర్మీ కేవ‌లం సోష‌ల్ మీడియా ద్వారా ఇచ్చిన ఈ పిలుపుకి విశేష స్పంద‌న ల‌భించ‌డంతో షాక్ అవ్వ‌డం ప్ర‌తి ఒక్క‌రి వంతు అయింది. కేవ‌లం హైదరాబాద్‌లో నిర్వహించిన 2కె రన్‌కి స్థానిక అభిమానులు ఈ రేంజ్‌లో హాజరైతే... రెండు తెలుగు రాష్ట్రాల్లో కౌశల్ ఆర్మీ ప్రభంజనం ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్ర‌స్తుతం బిగ్ బాస్ సీజ‌న్ 2 తుది ద‌శ‌కు చేరుకోవ‌డంతో విజేత ఎవ‌ర‌నే దానిపై హోరా హోరీగా చ‌ర్చ జ‌రుగుతుంది. కౌశ‌ల్ ప‌క్కాగా సీజ‌న్ 2 విజేత ట్రోఫిని అందుకొని బ‌య‌ట‌కి వ‌స్తాడ‌ని ఆయ‌న అభిమానులు కోరుకుంటున్నారు.
6346
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles