బోయ‌పాటి సినిమాలో కౌశ‌ల్‌..!

Tue,September 18, 2018 12:30 PM
kaushak gets a chance in boyapati movie

సీరియ‌ల్స్‌,సినిమాల‌లో న‌టించిన కౌశ‌ల్ మోడ‌ల్ కూడా అన్న సంగ‌తి తెలిసిందే. బిగ్ బాస్ సీజ‌న్ 2లో కంటెస్టెంట్‌గా వ‌చ్చిన ఈయ‌న త‌న ప్ర‌వ‌ర్త‌న‌తో అంద‌రి మ‌న‌సుల‌లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నాడు. ఇప్పుడు బిగ్ బాస్ అంటే కౌశ‌ల్‌, కౌశ‌ల్ అంటే బిగ్ బాస్ అన్న చందాన మారింది. ఆయ‌న కోసం కౌశ‌ల్ ఆర్మీ అనే గ్రూప్ ఫాం ప్రారంభం అయి వారు ర్యాలీలు, 2 కే ర‌న్ లు చేప‌ట్ట‌డం చూస్తుంటే కౌశ‌ల్‌కి ఉన్న క్రేజ్ ఏ పాటిదో అర్ధం చేసుకోవ‌చ్చు. ఈ క్రేజ్‌ని మ‌న ద‌ర్శ‌క నిర్మాత‌లు క్యాష్ చేసుకోవాల‌ని భావిస్తున్న‌ట్టు తెలుస్తుంది. మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శీను ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌లో యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ తెర‌కెక్కిస్తున్నాడు. ఈ సినిమా త‌ర్వాత బాల‌య్య‌తో క‌లిసి క్రేజీ ప్రాజెక్ట్ చేయ‌నున్నాడు. ఇందులో కౌశ‌ల్‌ని విల‌న్‌గా కాని లేదంటే కీల‌క పాత్ర కోసం ఎంపిక చేయాల‌ని అనుకుంటున్నాడ‌ట‌. ఇందుకోసం వారి కుటుంబ స‌భ్యుల‌తో కూడా చ‌ర్చ‌లు జ‌రిపాడ‌ట‌. ప్ర‌స్తుతం ఫిలింన‌గ‌ర్‌లో ఇదే టాపిక్‌పై ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. మ‌రి ఇందులో వాస్త‌వమెంత ఉంద‌నేది తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.

3339
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS