ఐఫా అవార్డుల్లో ఇద్ద‌రు క‌త్రినాకైఫ్‌లు!

Mon,July 17, 2017 03:57 PM
ఐఫా అవార్డుల్లో ఇద్ద‌రు క‌త్రినాకైఫ్‌లు!

అవును.. నిజంగానే ఐఫా అవార్డుల్లో ఒకే స‌మ‌యంలో ఇద్ద‌రు క‌త్రినా కైఫ్‌లు క‌నిపించారు. అక్క‌డ లైవ్‌లో ఇద్ద‌రు ఉన్నారో లేదో తెలియ‌దుగానీ.. టీవీలో ఈ అవార్డులు చూసిన వారికి మాత్రం ఇద్ద‌రు క‌త్రినాకైఫ్‌లు ఒకేసారి క‌నిపించారు. అదెలా అన్న డౌట్ వ‌స్తున్న‌దా? కింద ఉన్న వీడియో చూడండి.. మీకే తెలుస్తుంది. బెస్ట్ యాక్ట‌ర్ అవార్డును ప్ర‌క‌టించే స‌మ‌యంలో స్టేజ్‌పైనే ఉన్న క‌త్రినా.. త‌ర్వాతి ఫ్రేమ్‌లో కింద షాహిద్ క‌పూర్ ప‌క్క‌నే ఉంటుంది.


వీడియో ఎడిటింగ్‌లో దొర్లిన త‌ప్పిదం వ‌ల్ల ఇలా ఇద్ద‌రు క‌త్రినా కైఫ్‌లు ఒకేసారి క‌నిపించారు. నిజానికి బెస్ట్ యాక్ట‌ర్ అవార్డు ఇవ్వ‌డానికి క‌త్రినా స్టేజ్‌పైనే ఉంది. కానీ ఎడిటింగ్‌లో అంత‌క‌న్నా ముందు క‌త్రినా షాహిద్ ప‌క్క‌న కూర్చున్న మ‌రో సీన్‌ను తీసుకొచ్చి మ‌ధ్య‌లో ఇరికించారు. అవార్డు కోసం వ‌చ్చే స‌మ‌యంలో షాహిద్ ప‌క్క‌న క‌త్రినా లేదు. ఈ సీన్ చూసి ఫ్యాన్స్ కంగుతిన్నారు.

2219

data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS

Union Budget 2018