ఫ్యాన్స్‌తో కత్రినా కైఫ్ వాగ్వాదం.. వీడియో

Thu,July 12, 2018 01:30 PM
Katrina Kaif trolled by fans in Vancouver Canada

కత్రినా కైఫ్.. బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరు. హీరోలతో సమానంగా ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం అమెరికా, కెనడా టూర్లలో ఉన్న ఆమెకు వాంకూవర్‌లో చేదు అనుభవం ఎదురైంది. సల్మాన్ ఖాన్‌తో కలిసి దబాంగ్ టూర్‌లో ఉంది కత్రినా. ఈ సందర్భంగా వాంకూవర్‌లో ఓ షో చేసిన తర్వాత బయటకు వచ్చే సమయంలో అభిమానులు ఆమెను హేళన చేశారు. దీంతో సహనం కోల్పోయిన కత్రినా.. వాళ్లతో వాగ్వాదానికి దిగింది. కత్రినా తన కారు దగ్గరకు వెళ్లే సమయంలో.. నీతో మేమేమీ ఫొటో దిగమంటూ ఓ మహిళా అభిమాని హేళన చేసింది. దీంతో కత్రినాకు కోపం నషాళానికి అంటింది. మీరిలా అనడం బాగా లేదు. నేనిప్పటికీ పెద్ద షో చేసి అలసిపోయాను అని చెప్పింది. దీనికి ఆ అభిమాని కూడా గట్టిగానే స్పందించింది. ఫ్యాన్స్‌తో మీరిలా బిహేవ్ చేయడం బాగా లేదు. మీ ఆటిట్యూడ్ మార్చుకోవాలి అంటూ ఆ అభిమాని అంటున్నా పట్టించుకోకుండా కత్రినా మరో అభిమానితో సెల్ఫీ దిగుతూ కనిపించింది. ఇదే సమయంలో మేం మీ కోసం రాలేదు.. సల్మాన్ ఖాన్ కోసం వచ్చామంటూ మరికొందరు అన్నారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

2798
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles