మాజీ నియంతతో బాలీవుడ్ బ్యూటీ

Tue,July 11, 2017 11:39 AM
Katrina Kaif photo  With Gaddafi goes viral

ముంబై: క‌త్రినా కైఫ్ ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. ఎందుకో తెలుసా. ఆమె అందాల‌కు కాదు. జ‌గ్గా జాసూస్ ఫిల్మ్‌ ప్ర‌మోష‌న్ అస‌లేకాదు. బాలీవుడ్ బ్యూటీ ఫోటో ఒక‌టి ఇప్పుడు వైర‌ల్‌గా మారింది. ఎందుకంటే ఆమె ఆ ఫోటోలో ఉన్న‌ది ఒక నియంత‌తో. అత‌నెవ‌రో కాదు. లిబియా మాజీ నేత మెహ‌మ్మ‌ద్ గ‌డాఫీ. క‌త్రినాతో పాటు మోడ‌ళ్లు నెహా దూపియా, అదిత్ గోవిత్రిక‌ర్ కూడా ఆ ఫోటోలో ఉన్నారు. దాదాపు 15 ఏళ్ల క్రితం క‌త్రినా కైఫ్ లిబియా వెళ్లింది. అక్క‌డ ఆమె ఓ ఫ్యాష‌న్ షోలో పాల్గొన్న‌ది. అప్పుడు ఇండియ‌న్ మోడ‌ళ్లు గ‌డాఫీతో ఫోటోలు దిగారు. అప్పుడు క‌త్రినా వ‌య‌సు 18 ఏళ్లు. అయితే అప్ప‌టి ఫోటో ఇప్పుడు వైర‌ల్ కావ‌డంతో క‌త్రినా కొంత చికాకు గురైన‌ట్లు తెలుస్తున్న‌ది. నియంత గ‌డాఫీ 2011లో మృతిచెందాడు.


2235
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles