న‌న్ను ఇలా వ‌దిలేసి పెళ్లిళ్లు చేసుకోకండి

Tue,February 12, 2019 11:04 AM

పెళ్ళి అనేది స్త్రీ జీవితంలో ఓ మ‌ధుర ఘ‌ట్టం. ఇటు ఏడు త‌రాలు అటు ఏడు త‌రాలు చూసి మరీ పెళ్ళిళ్ళు చేసేవారు మ‌న పెద్ద‌లు. కాని ఇప్పుడు త‌రం మారింది. నేటి ట్రెండ్‌కి త‌గ్గ‌ట్టు అమ్మాయిలు వారికి న‌చ్చిన వ్య‌క్తుల‌తో వివిధ ర‌కాల ప‌ద్ద‌తుల‌లో వివాహాలు చేసుకుంటున్నారు. గ‌త ఏడాది బాలీవుడ్‌లో టాప్ సెల‌బ్రిటీలు అంద‌రు వ‌రుస‌గా పెళ్ళి పీట‌లెక్కారు. ముందుగా సోన‌మ్ క‌పూర్ త‌న ప్రియుడిని వివాహం చేసుకోగా, ఆ త‌ర్వాత దీపికా ప‌దుకొణే , ప్రియాంక చోప్రా ఇలా ఒక‌రి త‌ర్వాత ఒక‌రు త‌మ‌కి న‌చ్చిన వారితో ఏడ‌డుగులు వేసారు. ఈ ఏడాది కూడా కొంద‌రు భామ‌లు మూడు ముళ్ళు వేయించుకునేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఈ క్ర‌మంలో బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌గా ఉన్న క‌త్రినా కైఫ్ త‌న‌ని ఒంటరిని చేసి వివాహాలు చేసుకోవ‌ద్ద‌ని తోటి న‌టీమ‌ణుల‌కి చెబుతుంది.


కొద్ది రోజులుగా ఛ‌లోక్తుల‌తో వార్త‌ల‌లో నిలుస్తూ వ‌స్తున్న క‌త్రినా కైఫ్ తాజాగా ఫిలిం ఫేర్‌కి హాజ‌రైంది. ఈ సంద‌ర్భంలో క‌త్రినాని బాలీవుడ్‌లో వ‌రుస‌గా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. దీనిపై మీరు ఎలా స్పందిస్తారు అని ప్ర‌శ్నించ‌గా, అందుకు క‌త్రినా స్పందిస్తూ.. అంద‌రు పెళ్లి చేసుకోవ‌డం ఆనందంగా ఉంది. కాని నన్ను ఒంటరిని చేసి వివాహాలు చేసుకోవ‌ద్దు అంటూ ఫ‌న్నీగా బ‌దులిచ్చింది క‌త్రినా. భార‌త్ హీరోయిన్ ఫ‌న్నీ మాటలు విన్న అభిమానులు తెగ మురిసిపోతున్నారు. నువ్వు తొంద‌ర‌గా వివాహం చేసుకో అంటూ స‌ల‌హాలు ఇస్తున్నారు. క‌త్రినా ఐదేళ్లకి పైగా చాక్లెట్ బాయ్ ర‌ణ్‌బీర్ సింగ్‌తో ప్రేయాయంణంలో ఉండ‌గా, మ‌న‌స్ప‌ర్ధ‌ల వ‌ల‌న వారి ప్రేమకి బ్రేక‌ప్ ప‌డింది. ప్ర‌స్తుతం సింగిల్‌గానే ఉంటున్న ఈ అమ్మ‌డు సినిమాల‌తో బిజీ అయింది. ఇటీవ‌ల జీరో చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన క‌త్రినా ప్ర‌స్తుతం భార‌త్ సినిమాలో స‌ల్మాన్ స‌ర‌స‌న న‌టిస్తుంది.

క‌త్రినా ఇటీవ‌ల తాను క్రికెట్ ఆడుతున్న వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ జీరో కోస్టార్ అనుష్క శ‌ర్మ‌కి మెసేజ్ ఇచ్చింది. నా బ్యాటింగ్ తీరు చూసి వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ఆడే అవ‌కాశం ఇవ్వ‌మని మీ భ‌ర్త ( విరాట్ కోహ్లీ)కి సూచ‌న చేయ‌వు. నేను ప్రాక్టీస్‌లో నిమ‌గ్న‌మై ఉన్నాను. మంచి ఆల్ రౌండ‌ర్‌గా జ‌ట్టుకి సేవ‌లందిస్తానంటూ ఫ‌న్నీ కామెంట్ పెట్టింది కత్రినా. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో ఫుల్ వైర‌ల్ అయింది.

4042
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles