బిగ్‌బాస్‌లో క‌త్రినా కైఫ్‌..!

Tue,April 24, 2018 08:00 AM
Katrina Kaif and Salman Khan host for big boss

ప్ర‌స్తుతం టాలీవుడ్,బాలీవుడ్‌, కోలీవుడ్‌, మాలీవుడ్‌ల‌లో ఇంట్రెస్టింగ్ రియాలిటీ షో బిగ్ బాస్ అని చెప్ప‌వ‌చ్చు. అయితే హిందీ బిగ్‌బాస్‌కు ఎంత క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ప్రతి సీజన్‌కు రికార్డు టీఆర్పీలతో ఈ రియాల్టీ షో దూసుకెళ్తున్నది. 2017లో బిగ్ బాస్‌11 పూర్తి కాగా త్వ‌ర‌లో బిగ్ బాస్ 12షో మొద‌లు కానుంది. ఈ షోతో బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని అల‌రించేందుకు నిర్వాహ‌కులు స‌రికొత్త ప్లాన్ చేస్తున్నారు. ఈ ఎపిసోడ్ కోసం పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు, హిజ్రాలు, లెస్బియన్స్ ఇలా ప్ర‌తి ఒక్కరితో ఆడిష‌న్స్ నిర్వ‌హించాల‌ని అనుకుంటున్నార‌ట‌. ముఖ్యంగా స‌ల్మాన్‌కి కోహోస్ట్‌గా క‌త్రినా కైఫ్‌ని తీసుకోవాల‌ని భావిస్తున్నార‌ట‌. మాజీ ల‌వ‌ర్స్ అయిన వీరిద్ద‌రి మ‌ధ్య కెమిస్ట్రీ బాగుంటుంది కాబ‌ట్టి, ఇద్దరు క‌లిసి షో చేస్తే మ‌రింత ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉంటుంద‌ని నిర్వాహ‌కుల ఆలోచ‌న‌గా తెలుస్తుంది. క‌త్రినా కైఫ్ ప్ర‌స్తుతం జీరో సినిమాతో బిజీగా ఉంటే, స‌ల్మాన్ రేస్ 3 షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. అయితే సీజ‌న్‌12 కి కూడా స‌ల్మాన్‌ని హోస్ట్‌గా ఎంపిక చేయడం ప‌క్కా అయితే తొమ్మిదోసారి సల్మాన్ ఈ షోని హోస్ట్ చేస్తున్నట్టు అవుతుంది. సల్మాన్ తొలిసారి 2010లో బిగ్‌బాస్ సీజన్ 4కు హోస్ట్‌గా వ్యవహరించాడు. 2011లో బిగ్‌బాస్ 5ని సంజయ్‌దత్ హోస్ట్ చేశాడు. ఆ త‌ర్వాత మిగ‌తా సీజ‌న్స్ అన్నింటికి స‌ల్మాన్ హోస్ట్‌గా ఉంటున్నాడు.

2516
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles