'థ‌గ్స్ ఆఫ్ హిందూస్థాన్' నుండి క‌త్రినా లుక్ అవుట్‌

Fri,September 21, 2018 12:30 PM
katrina first look revealed

బాలీవుడ్‌లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిన చిత్రం థ‌గ్స్ ఆఫ్ హిందుస్థాన్‌. అమీర్ ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లో విజ‌య్ కృష్ణ ఆచార్య తెర‌కెక్కించిన ఈ చిత్రంలో అమితాబ్ బ‌చ్చ‌న్ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. కమాండర్ ఖుదాబక్ష్ పాత్రలో అమితాబ్ లుక్‌ని రీసెంట్‌గా విడుద‌ల చేసిన టీం సినిమాపై భారీ ఆస‌క్తి క‌లిగించింది. ఇక కత్రినాకైఫ్, ఫాతిమా సనా షేక్ కథానాయికలుగా నటిస్తుండ‌గా, ఫాతిమా లుక్ ఇప్ప‌టికే విడుద‌ల కాగా, తాజాగా క‌త్రినా లుక్ విడుద‌ల చేశారు. సుర‌య్య పాత్ర‌లో క‌త్రినా అద‌ర‌గొడుతుంది. కల్నల్ ఫిలిప్ మెడోవ్స్ 1983లో రాసిన కన్ఫేషియన్స్ ఆఫ్ ఎ థగ్ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. యష్‌రాజ్ ఫిల్మ్స్ పతాకంపై ఆదిత్యచోప్రా అత్యంత భారీ స్థాయిలో చిత్రం రూపొందుతుంది. న‌వంబ‌ర్ 8న విడ‌ద‌ల కానున్న ఈ చిత్రానికి సంబంధించి భారీ ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు నిర్మాత‌లు . 300 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఈ సినిమాను ఆదిత్య చోప్రా, ఆమిర్‌ఖాన్ నిర్మిస్తున్నారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మరాఠీ చిత్రం సైరట్‌కు సంగీతం అందించిన అజయ్-అతుల్ ఈ చిత్రానికి పనిచేస్తున్నారు

959
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles