విశాల్ తో తమన్నా రొమాన్స్ అదిరింది

Sat,November 5, 2016 08:05 AM
Kaththi Sandai - Official Tamil Trailer

మాస్‌ హీరో విశాల్‌ కథానాయకుడిగా సురాజ్ దర్శరత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ కత్తి సాండై. తెలుగులో ఈ చిత్రం ఒక్కడొచ్చాడు టైటిల్ తో విడుదల కాబోతుంది. ఈ చిత్రంలో విశాల్ సరసన తమన్నా కథానాయికగా నటించగా, నవంబర్‌ 18న చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేయడానికి నిర్మాత జి.హరి సన్నాహాలు చేస్తున్నారు. విశాల్‌ కెరీర్‌లోనే ఈ చిత్రం డిఫరెంట్‌ మూవీ అవుతుందని, ఇందులో యాక్షన్‌ వుంటూనే మంచి మెసేజ్‌ కూడా అందిస్తున్నామని యూనిట్ తెలిపింది. చిత్రంలోని పాటలు, యాక్షన్‌ సీక్వెన్స్‌లు, ఛేజ్‌లను చాలా రిచ్‌గా తీసారు. అవి సినిమాకి అవి చాలా పెద్ద హైలైట్‌ అవుతాయని చిత్ర బృందం భావిస్తోంది. ఇంక ఈ భారీ చిత్రంలో ప్రైమ్‌స్టార్‌ జగపతిబాబు విలన్‌గా నటించగా.. సంపత్‌రాజ్‌, చరణ్‌, జయప్రకాష్‌, వడివేలు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. తాజాగా చిత్రానికి సంబంధించి తమిళ వర్షెన్ ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ యాక్షన్ సన్నివేశాలతో పాటు తమన్నాతో విశాల్ రొమాన్స్ చేసే సీన్స్ అద్భుతంగా ఉన్నాయి. ఈ చిత్రం అటు తమిళం, ఇటు తెలుగులో మంచి విజయం సాధించే అవకాశాలున్నాయని చెబుతున్నారు.

1979
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles