పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌పై కత్తి మహేశ్ పోలీస్ కంప్లయింట్

Fri,January 19, 2018 03:52 PM
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌పై కత్తి మహేశ్ పోలీస్ కంప్లయింట్

కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నుంచి చాలా రకాలుగా వేధింపులు ఎదుర్కొంటున్నానంటూ ఫిలిం క్రిటిక్, నటుడు కత్తి మహేశ్ ఇంటర్వ్యూలలో వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. నిన్న‌ ఓ ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గొనడానికి మహేశ్ కారులో వెళ్తుండగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చి ఆయనపై కోడి గుడ్లతో దాడి చేశారు. ఇది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పనే అంటూ కత్తి మహేశ్ చెబుతున్నాడు. అంతే కాదు.. వారిపై ఆయన ఇవాళ పోలీస్ కంప్లయింట్ కూడా ఇచ్చాడు.

"సర్.. నా పేరు కత్తి మహేశ్. నేను ఫిలిం క్రిటిక్, రైటర్ అండ్‌ డైరెక్టర్. నిన్న(18-01-2018) నా మీద దాడి జరిగింది. నేను ఓ టీవీ స్టూడియోకు వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు నాపై కోడిగుడ్లు విసిరారు. మాదాపూర్ సైబర్ టవర్స్, శిల్పారామం మ‌ధ్య‌లో ఈ ఘటన జరిగింది.

అయితే.. నాపై దాడి చేసింది మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే. గత 4 నెలల నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నుంచి నాకు విపరీతంగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. రీసెంట్‌గా ఖైరతాబాద్ ప్రెస్ క్లబ్‌లో నాపై దాడి చేయడానికి కూడా వాళ్లు ప్రయత్నించారు. వాళ్లపైన కేసు నమోదు చేసి నాపై దాడి చేసిన వారిని గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని నేను కోరుతున్నాను." అంటూ కత్తి మహేశ్ మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో రిటన్ కంప్లయింట్ ఇచ్చాడు.

1838

data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS

Union Budget 2018